ఎస్బీఐ ఖాతాదారులకు హెచ్చరిక..ఇలాంటి వాటిని అస్సలు నమ్మకండి..

Satvika
ప్రభుత్వ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లను సైబర్ నేరగాల్ల బారిన పడకుండా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే..అయిన కూడా మళ్ళీ మళ్ళీ రిస్క్ లో పడుతున్నారు..ఎస్‌బీఐలో 40 కోట్లకు పైగా ఖాతాదారులున్న సంగతి తెలిసిందే. సైబర్ నేరగాళ్లు ఎస్‌బీఐ అకౌంట్‌హోల్డర్లను టార్గెట్ చేస్తున్నారు. ఏదో ఒక మెసేజ్ పంపి ఎస్‌బీఐ ఖాతాదారుల నుంచి డబ్బులు కాజేస్తున్నారు. తాజాగా సైబర్ నేరగాళ్లు పాన్ కార్డ్ అప్‌డేట్  పేరుతో ఇమెయిల్స్, ఎస్ఎంఎస్‌లు పంపిస్తున్నారు. మీ ఎస్‌బీఐ యోనో అకౌంట్ క్లోజ్ అయిందని, వెంటనే మీ పాన్ కార్డ్ అప్‌డేట్ చేయాలని ఇమెయిల్స్, ఎస్ఎంఎస్‌లు ఎస్‌బీఐ ఖాతాదారులకు వస్తున్నాయి. 



సైబర్ నేరగాళ్లు పాన్ కార్డ్ అప్‌డేట్ చేయాలంటూ ఎస్‌బీఐ ఖాతాదారులకు లింక్స్ కూడా పంపిస్తున్నారు. ఆ లింక్స్ క్లిక్ చేస్తే అంతే సంగతులు. లింక్ క్లిక్ చేయగానే ఓ వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. అందులో బ్యాంకు ఖాతా వివరాలు ఎంటర్ చేయాలని సైబర్ నేరగాళ్లు కోరతారు. కీలకమైన బ్యాంక్ అకౌంట్ వివరాలు, పాన్ నెంబర్, డెబిట్ కార్డ్ నెంబర్, సీవీవీ లాంటి డీటెయిల్స్ ఎంటర్ చేస్తే సైబర్ నేరగాళ్లు అకౌంట్ ఖాళీ చేయడం గ్యారెంటీ..అందుకే ఇలాంటి మెసేజెస్, మెయిల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఈ మెసేజెస్, ఇమెయిల్స్‌కు స్పందించకూడదని, వ్యక్తిగత వివరాలు, బ్యాంకింగ్ వివరాలు వెల్లడించకూడదని భారత ప్రభుత్వానికి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెకింగ్ విభాగం అయిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్ హెచ్చరిస్తోంది. ఒకవేళ మీకు పదేపదే ఇలాంటి మెసేజెస్ వస్తే report.phishing@sbi.co.in మెయిల్ ఐడీకి కంప్లైంట్ చేయాలి.


ఎస్‌బీఐ అకౌంట్‌కు పాన్ నెంబర్ లింక్ చేయనట్టైతే ఆన్‌లైన్‌లో లింక్ చేయొచ్చు...


*. ముందుగా https://www.onlinesbi.sbi/ పోర్టల్ ఓపెన్ చేయాలి.
*. మీ వివరాలతో లాగిన్ కావాలి.
*. ఆ తర్వాత మై అకౌంట్స్ సెక్షన్‌లో ప్రొఫైల్ ఓపెన్ చేయాలి.
*.ఆ తర్వాత PAN Registration పైన క్లిక్ చేయాలి.
*.అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేయాలి.
*. పాన్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.


ఏడు రోజుల్లో మీ అకౌంట్ నెంబర్‌కు పాన్ నెంబర్ లింక్ అవుతుంది. మీ అకౌంట్‌కు పాన్ నెంబర్ లింక్ అవగానే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఎస్ఎంఎస్ వస్తుంది. ఎస్‌బీఐ ఏటీఎంలో కూడా దాదాపు ఇవే స్టెప్స్‌తో మీ పాన్ నెంబర్ లింక్ చేయొచ్చు. లేదంటే మీరు నేరుగా దగ్గర్లోని ఎస్‌బీఐ బ్రాంచ్‌కు వెళ్లాలి. ఫామ్ పూర్తి చేసి, మీ పాన్ కార్డ్ జిరాక్స్ కాపీ జత చేసి సబ్మిట్ చేయాలి..అంతే పాన్ కార్డు లింక్ అవుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: