"ఇంటి అద్దె" అడిగితే చంపేస్తానంటున్న ఎంపీ గోరంట్ల మాధవ్ !

VAMSI
ఆంద్రప్రదేశ్లో రాయలసీమ జిల్లా అనంతపురం లోని హిందూపురానికి ఎంపీగా ఉన్న గోరంట్ల మాధవ్ కు టైం అస్సలు బాగాలేనట్లుంది. ఈ మధ్యనే గోరంట్ల మాధవ్ న్యూడ్ కాల్ వీడియో ఎంత కలకలం సృష్టించింది అన్నది మనము చూశాము. ఒక మహిళతో వీడియో కాల్ మాట్లాడుతూ అడ్డంగా దొరికిపోయిన గోరంలా మాధవ్ పై దేశవ్యాప్తంగా విమర్శలు కోకొల్లలుగా వచ్చాయి. కానీ మాధవ్ మాత్రం అందులో ఉన్నదీ నేను కాదని, ఇది రాజకీయంగా నన్ను దెబ్బ తీయడానికి ప్రతిపక్షాలు చేస్తున్న కుట్ర అని గొడవకు దిగారు. కానీ టీడీపీ మాత్రం దీనిని సీరియస్ గా తీసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించి మరీ ఇందులో ఉన్నది గోరంట్ల మాధవ్ అని రిపోర్ట్ విడుదల చేసింది.
అయితే ఈ విషయం ఎలాగోలా పెద్దది కాకుండా అందరూ మరిచిపోయారు... గోరంట్ల మాధవ్ కూడా ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో మరో వివాదంలో ఇరుక్కున్నారు. ప్రస్తుతం తాను నివాసం ఉంటున్న ఇల్లు తన సొంతం కాదని తెలిసిందే. అయితే ఈ ఇంటి ఓనర్ మల్లికార్జున్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం గోరంట్ల మాధవ్ ఆ ఇంటికి సంబంధించిన రెంట్ మరియు కరెంటు బిల్లులు కట్టలేదని తెలుస్తోంది. వీటి తాలూకు డబ్బులు రెండు లక్షల రూపాయల వరకు పెండింగ్ లో ఉందట. అయితే మల్లికార్జున్ రెడ్డి ఆ డబ్బులు చెల్లించాలని అడిగినా ఇవ్వకపోగా తనను తన అనుచరుల ట్రిప్పర్ తో తొక్కిస్తానని బెదిరిస్తున్నాడట.  
ఈ విషయంలో న్యాయం చెయ్యాలని ఇంటి ఓనర్ మల్లికార్జున్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడట. కానీ పోలీసులు రంగంలోకి దిగి ఇద్దరితో మాట్లాడాలని ప్రయత్నించినా మొదటిసారి సఫలం కాలేదని తెలుస్తోంది. పోలీసులు మరోసారి ఇద్దరితో మాట్లాడి ఈ అంశాన్ని పరిష్కరించాలని అనుకుంటున్నారట. ఇంటి ఓనర్ మల్లికార్జున్ రెడ్డి ఈ పెండింగ్ అమౌంట్ పే చేసిన తర్వాత ఇంటిని ఖాళీ చెయ్యాలని కూడా చెప్పాడట. ఈ వార్త తెలిసన పలువురు అదేంటి ఎంపీ గా ఉండి సొంత ఇల్లు లేకపోవడం ? రెంట్ ఇల్లు ఉన్న అద్దె కట్టకపోవడం ఏంటి అంటూ అవాక్కవుతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: