అచ్చెన్నాయుడును ఓడించడమే లక్ష్యంగా వైసీపీ అడుగులు !

VAMSI
ఆంధ్రప్రదేశ్ లో జగన్ వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రతి నియోజకవర్గంలో ఉన్న లోటు పాట్లను సవరించుకుని ఎన్నికల సమయానికి అనుకూలంగా మార్చుకోవడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో వైసీపీ గతంలో కన్నా బలంగా పుంజుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. గత 2019 ఎన్నికల్లో వైసీపీ టెక్కలి మరియు ఇచ్చాపురం నియోజకవర్గాలలో మినహా మిగిలిన అన్ని చోట్ల విజయం సాధించింది. అందుకే ఈ సారి క్లీన్ స్వీప్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారట జగన్. రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తర్వాత ఆ స్థాయిలో అధికార పార్టీ మీద విరుచుకుపడుతున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని ఓడించాలని పావులు కదుపుతున్నారట సీఎం జగన్.
అచ్చెన్నాయుడు శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ అచ్చెన్నాయుడిని ఎదుర్కొనేందుకు టెక్కలికి వైసీపీ తరపున దువ్వాడ శ్రీనివాస్ ను ఇప్పటికే ఖరారు చేశారు. ఎటువంటి పరిస్థితుల్లో 2024 ఎన్నికల్లో ఒక్క స్థానంలో కూడా శ్రీకాకుళం జిల్లాలో ఓడిపోకూడదని జిల్లా మంత్రులకు, ఎమ్మెల్యేలకు , కార్యకర్తలకు గట్టిగా సూచనలు ఇచ్చాడట జగన్. అయితే ప్రజలు వైసీపీకి తప్ప మరోపార్టీకి ఓటు వేయడానికి వీలు లేకుండా ఇక్కడ ఉన్న సమస్యలపైన దృష్టిని సారించారు. అందులో భాగంగా ఇక్కడ ప్రధాన సమస్యగా మారిన ఉద్దానం కిడ్నీ కు పరిష్కారం చూపించే దిశగా తన అడుగులు పడుతున్నాయి. ఇక్కడ పెద్ద హాస్పిటల్ ను ఏర్పాటు చేస్తున్నారట.
ఇక ఈ జిల్లాలో మరో సమస్య ఉపాధి పనుల కోసం ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లిపోవడం. ఇది ఎంతో కాలంగా జరుగుతూ వస్తోంది.. దీనికి కూడా పరిష్కార మార్గం చూపడానికి జగన్ మరియు ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. మొత్తానికి ఈ జిల్లాలో అచ్చెన్నాయుడును ఓడించడానికి ప్రత్యేక ఫోకస్ పెట్టారట. పైన మనము చెప్పుకున్న రెండు సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరికితే కనుక శ్రీకాకుళం మొత్తం వైసీపీ వశం అయినట్లే. మరి ఆ విధంగా జరుగుతుందా లేదా తెలియాలంటే ఇంకా కొంతకాలం వేచిచూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: