అంబానీ బ్రదర్స్: కష్టాల్లో తమ్ముడు.. అండగా నిలిచిన అన్న?

Purushottham Vinay
ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ  రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్ దివాలా తీసిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ కంపెనీ ఆస్తులను సొంతం చేసుకునే ప్రయత్నంలో ఉంది.ఈ సెటిల్‌మెంట్ అనేది ఎట్టకేలకు 2 సంవత్సరాల తర్వాత ముగుస్తోంది.రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ముంబై సిటీలోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో తాజాగా దరఖాస్తును కూడా దాఖలు చేసింది.ఈ దరఖాస్తులో రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్ కంపెనీని, ఇక దాని ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్క్రో అకౌంట్లో మొత్తం రూ.3,720 కోట్లను డిపాజిట్ చేసేందుకు రెడీ అని వెల్లడించింది. ఇక దీని ద్వారా దివాలా తీసిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ టెలికాం టవర్ అండ్ ఫైబర్ ఆస్తులను జియో సంస్థ చేజిక్కించుకోనుంది.ఇక అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ టెలికాం మార్కెట్లో తీవ్ర పోటీ కారణంగా కస్టమర్లను కూడా కోల్పోవడం జరిగింది . దీంతో బ్యాంకులకు చెల్లించాల్సిన లోన్ లను డీఫాల్ట్ అయి కంపెనీ దివాళీ తీసింది. అయితే కంపెనీకి రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్‌ కింద ఉన్న ఆస్తులను కోనేందుకు రిలయన్స్ జియో ఎంపికైంది.


అయితే ఈ ఆస్తులను సొంతం చేసుకోవటంలో జాప్యం అనేది జరుగుతోంది. అయితే రిజల్యూషన్ నిధుల పంపిణీపై రుణదాతల మధ్య వివాదాలు అనేవి కొనసాగుతున్నందున వాటి వాల్యూ కూడా తగ్గుతోందని అక్టోబర్ 20 వ తేదీన NCLTకి సమర్పించిన నివేదికలో జియో కంపెనీ తెలిపింది.ముఖేష్ అంబానీ ఇంకా అనిల్ అంబానీల మధ్య కొన్నేళ్లుగా అనేక రకాల సమస్యలు ఉన్నప్పటికీ రిలయన్స్ కమ్యూనికేషన్స్ దివాళా తీయడంతో అనిల్ అంబానీ సామ్రాజ్యం మొత్తం కూడా దెబ్బకు కుప్పకూలింది. అందువల్ల ఆర్ కామ్ ఆస్తులను కొనుగోలు చేసేందుకు ఎవరూ కూడా ముందుకు రాకపోవడంతో ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో అందుకు ఆసక్తి చూపింది.ఇక ఈ ప్రకటనతో అంబానీ సోదరులు ఇద్దరూ కూడా మళ్ళీ సన్నిహితంగా మారడమే కాకుండా, తనకు సహాయం చేసినందుకు అనిల్ అంబానీ అన్నకు కృతజ్ఞతలు కూడా తెలిపారు. దీని తర్వాత లండన్ కోర్టులో అనిల్ అంబానీపై దాఖలైన కేసులో తనకు ఎలాంటి ఆస్తులు లేవని, తన ఆస్తి విలువ సున్నా అని గతంలోనే ప్రకటించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: