అమరావతి : అండ లేకపోతే నిజంగా వీళ్ళేమైపోయేవాళ్ళో ?

Vijaya




గడచిన పదిరోజులుగా రాష్ట్ర రాజకీయాలు చూస్తుంటే అచ్చంగా చాలామందికి ఇదే అనుమానం వస్తోంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై పోరాటాలు చేయటంలో చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ చేతులెత్తేసినట్లే ఉంది. అందుకనే వాళ్ళస్ధానంలో ఎల్లోమీడియా బాగా యాక్టివ్ అయిపోయింది. ఇపుడేకాదు జగన్ ముఖ్యమంత్రయిన దగ్గర నుండి ఎల్లోమీడియాది ఇదేవరస.  కాకపోతే ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కదా యాక్షన్ చాలా ఓవర్ అయిపోతోందంతే.



ఇంతకీ విషయం ఏమిటంటే చంద్రబాబు తెరవెనుక నిలబడి పవన్ కల్యాణ్ ను రెచ్చగొడుతున్నారు. దాంతో పవన్ బాగా రెచ్చిపోతున్నారు. వీళ్ళ యాక్షన్ కు ఎల్లోమీడియా ఓవర్ యాక్షన్ కలవటంతో చిన్న విషయం కూడా చాలా పెద్దదైపోయి గోలగోలైపోతోంది. వైజాగ్ లో మంత్రులపైన జనసైనికులు దాడులు చేస్తే దాన్ని చంద్రబాబు, పవన్ ఉల్టాగా ఆరోపణలు చేశారు. దీనికి ఎల్లోమీడియా విస్తృతంగా ప్రచారం కల్పించింది.  చివరకు సీసీటీవీ ఫుటేజీలు పరిశీలిస్తే ఎవరిపైన ఎవరు దాడులుచేశారో అర్ధమైపోయింది. దాంతో వీళ్ళకు మళ్ళీ నోళ్ళు లేవలేదు.



తర్వత పవన్ పైన హత్యచేసేందుకు రెక్కీ అంటు నాలుగురోజులు గోలచేశారు. చివరకు రెక్కీలేదు పాడూలేదు తాగుబోతుల గొడవని చెప్పి న్యూసెన్స్ కేసుగా పోలీసులు తేల్చేశారు. ఇంతచిన్న ఘటనకు పవన్ హత్యకు రెక్కీ అంటు గోలచేశారు. వీళ్ళ గోలకు ఎల్లోమీడియా విపరీతమైన హైప్ ఇచ్చింది. పోలీసుల విచారణతో  చంద్రబాబు, పవన్ తో పాటు ఎల్లోమీడియా ఓవర్ యాక్షన్ బయటపడటంతో ఏమిచేయాలో దిక్కుతోచలేదు.



ఇంతలో తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో రోడ్డువిస్తరణ గోల కలిసొచ్చింది. ఆక్రమించుకుని  జనాలు కట్టుకున్న ఇంటి కాంపౌడ్ గోడలను ప్రభుత్వం కూల్చేసి రోడ్డు విస్తరణ పనులు మొదలుపెట్టింది. దీన్నే ప్రభుత్వం ఇళ్ళు కూల్చేస్తోందన్నట్లుగా పవన్ బిల్డప్ ఇవ్వటం, దానికి చంద్రబాబు, ఎల్లోమీడియా తందాన అనటం విచిత్రంగా ఉంది. గోల మధ్యలో చంద్రబాబు, పవన్ ఇద్దరు జగన్మోహన్ రెడ్డికి శాపనార్ధాలు పెట్టడం భలేగా ఉంది. మధ్యలో చంద్రబాబు కాన్వాయ్ పై రాయివిసరటం అనేగోల మొదలైంది. ఇదంతా చూస్తుంటే అసలు ఎల్లోమీడియా అనేదే లేకపోతే చంద్రబాబు, పవన్ ఏమైపోయుండేవారో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే పబ్లిసిటీ కోసం వీళ్ళిద్దరు ఎల్లోమీడియా మీద అంతలా డిపెండ్ అయిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: