రూ.95 ఇన్వెస్ట్ చేస్తే రూ.13 లక్షలకు పైగా ఆదాయం..పూర్తి వివరాలు..

Satvika
డబ్బులను పొదుపు చెయ్యాలని అందరికి ఉంటుంది.. అయితే ఎక్కడ ఇన్వెస్ట్ చెస్తె మంచి లాభం వుంటుంది అన్న విషయం చాలా మందికి తెలియదు..తక్కువ డబ్బుతో కూడా పొదుపు ప్రారంభించవచ్చు. రోజూ టీ, కాఫీల కోసం బయట ఎంత ఖర్చు చేస్తారో అంత పొదుపు చేసినా చాలు. లక్షల రూపాయల రిటర్న్స్ వస్తాయి. ఇలా మంచి రిటర్న్స్ ఇచ్చే పొదుపు పథకాలు చాలా ఉన్నాయి. ఇండియా పోస్ట్ అనేక పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్‌ని అందిస్తోంది. అలాంటి పథకాల్లో సుమంగళ్ రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్స్యూరెన్స్ స్కీమ్ కూడా ఒకటి. ఈ స్కీమ్‌లో రోజూ రూ.95 చొప్పున పొదుపు చేస్తే రూ.13 లక్షల పైనే రిటర్న్స్ వస్తాయి. ఎలాగో తెలుసుకోండి..

ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలు..దగ్గర్లో ఉన్న ఏ పోస్ట్ ఆఫీసులో అయినా సుమంగళ్ రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్స్యూరెన్స్ స్కీమ్‌లో చేరొచ్చు. 19 ఏళ్ల నుంచి 45 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవారు ఈ పథకంలో చేరొచ్చు. రూ.10 లక్షల సమ్ ఇన్స్యూర్డ్‌తో ఈ పాలసీ తీసుకోవచ్చు. అనుకోని పరిస్థితుల్లో పాలసీహోల్డర్ మరణిస్తే నామినీకి పాలసీడబ్బులతో పాటు బోనస్ డబ్బులు కూడా వస్తాయి..ఈ పాలసీలో 15 ఏళ్లు, 20 ఏళ్ల మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. ఇది మనీ బ్యాక్ పాలసీ కాబట్టి పాలసీ మధ్యలోనే డబ్బులు వస్తాయి.

పాలసీహోల్డర్ 15 ఏళ్ల పాలసీ తీసుకుంటే 6 ఏళ్లు, 9 ఏళ్లు, 12 ఏళ్లు పూర్తైన తర్వాత, 20 ఏళ్ల పాలసీ తీసుకుంటే 8 ఏళ్లు, 12 ఏళ్లు, 16 ఏళ్లు, 20 ఏళ్లు పూర్తైన తర్వాత కొంత మనీబ్యాక్ వస్తుంది. మిగతా 40 శాతం మెచ్యూరిటీ సమయంలో బోనస్‌తో కలిపి వస్తుంది. ఓ 25 వ్యక్తి 20 ఏళ్ల పాలసీ గడువుతో రూ.7 లక్షల సమ్ అష్యూర్డ్ పాలసీ తీసుకున్నారనుకుందాం. రోజుకు రూ.95 చొప్పున ప్రీమియం చెల్లించాలి. అంటే నెలకు రూ.2,850, ఆరు నెలలకు రూ.17,100 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. పైన చెప్పినట్టుగా 8 ఏళ్లు, 12 ఏళ్లు, 16 ఏళ్లు, 20 ఏళ్లు పూర్తైన తర్వాత మనీబ్యాక్ వస్తుంది. ఈ మనీబ్యాక్ కాకుండా బోనస్‌తో కలిపి మెచ్యూరిటీ సమయంలో రూ.9.52 లక్షలు వస్తుంది. మనీబ్యాక్, మెచ్యూరిటీ సమయంలో వచ్చే డబ్బులు మొత్తం కలిపి రూ.13.72 లక్షల వరకూ పొందొచ్చు...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: