అమరావతి : పవన్ ప్లాన్ ఇదేనా ?

Vijaya






పవన్ వైఖరి చూస్తుంటే ప్రభుత్వంతో ఘర్షణకు రెడీ అవుతున్నట్టే ఉంది. ఘర్షణ పెంచుకోవటం ద్వారా యూత్ లో క్రేజు సంపాదించుకునే వ్యూహంలో ఉన్నట్లు సమాచారం.  ఓ పదిరోజుల క్రితం పవన్ పార్టీఆఫీసులో మాట్లాడుతు తనను ప్యాకేజిస్టార్ అనే వాళ్ళని చెప్పుతీసుకుని కొడతానని చెప్పుచూపించి మరీ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. తనను ఇకనుండి ఎవరైనా ప్యాకేజిస్టార్ అంటే ఇళ్ళల్లోనుండి బయటకు లాక్కొచ్చి చెప్పుతీసుకుని కొడతానని పూనకంతో ఊగిపోయారు.



పవన్ చెప్పు వ్యవహారం తర్వాత మంత్రులు, వైసీపీ నేతల నుండి అంతేగట్టిగా ఎదురుదాడి జరిగింది. పవన్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా మంత్రులు, మాజీమంత్రులు పవన్ను ప్యాకేజీస్టార్ అనే కామెంట్లుచేశారు. అయితే వాళ్ళ కామెంట్లకు పవన్ మళ్ళీ సమాధానం చెప్పలేదు. అలాటింది ఆదివారం పార్టీఆఫీసులో జరిగిన రాజకీయ వ్యవహారాల కమిటి సమావేశంలో మాట్లాడుతు ప్రభుత్వానికి చెప్పు చూపించటాన్ని సమర్ధించుకున్నారు.



అన్నీ వ్యవస్ధలను నాశనంచేస్తు, అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన ఈ ప్రభుత్వానికి చెప్పుచూపించటంలో తప్పేమిటంటు ఎదురు ప్రశ్నించారు. సమావేశంలో మాట్లాడుతు ప్రభుత్వంపై పవన్ అనేక ఆరోపణలు, విమర్శలు చేశారు. సరే ఇవన్నీ పవన్ రెగ్యులర్ గా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా చేస్తున్నవే కాబట్టి సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరంలేదు. పార్టీ ఆఫీసులో మాట్లాడిన మాటలుచూస్తుంటే ప్రభుత్వంతో ఘర్ణణ వైఖరికే పవన్ సిద్ధపడినట్లు అర్ధమవుతోంది.



ఏ అంశాల్లో అయితే ప్రభుత్వాన్ని పవన్ ఇపుడు తప్పుపడుతున్నారో చంద్రబాబునాయుడు హయాంలో కూడా ఇలాంటి ఘటనలే  జరిగాయి. అయినా అప్పట్లో పవన్ అసలు నోరిప్పలేదు. చంద్రబాబు హయాంలో కోడూరు, కర్నూలులో విద్యార్ధినులపై  జరిగిన హత్యాచారాలను కూడా జగన్ ఖాతాలో వేసేయటమే ఆశ్చర్యంగా ఉంది. ప్రశ్నించటానికే పార్టీ పెట్టానన్న పవన్ మాటలు చూస్తుంటే కేవలం జగన్ను ప్రశ్నించటానికే పార్టీ పెట్టినట్లు అర్ధమైపోతోంది. ఇపుడు జగన్ను ప్రశ్నిస్తున్నట్లే అప్పట్లో చంద్రబాబును కూడా ప్రశ్నించుంటే బాగుండేది. కాబట్టి ఇపుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా  పవన్  ఒక చెప్పుచూపించినా రెండు చెప్పులు  చూపించినా ఫలితముంటుందా అనేదే అనుమానం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: