భారత్ లో మరో ప్రాణాంతకరమైన వ్యాధి..వైద్యులు ఏమన్నారంటే?

Satvika
మన దేశంలో గత రెండేళ్ళు కరోనా వైరస్ జనాలు తీవ్ర భయ బ్రాంతులకు గురి చేసింది..చాలామంది ప్రాణాలను కూడా పోగొట్టుకున్నారు.ఆ వ్యాధి నుంచి ఇప్పటికీ జనాలు బయటకు రాలేదు..కానీ ఇప్పుడు మరో వ్యాధి జనాలకు భయాన్ని కలిగిస్తుంది.కోవిడ్ తర్వాత దేశంలో టీబీ రోగుల సంఖ్య ఆశ్చర్యకరంగా పెరుగుతోంది. 2021లో భారతదేశంలో మొత్తం 21.4 లక్షల tb కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు tb రోగుల కేసులు 2020 కంటే 18% ఎక్కువగా నమోదు కావటం మరింత ఆందోళన కలిగిస్తోంది..ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) గురువారం విడుదల చేసిన గ్లోబల్ టీబీ నివేదిక-2022లో ఈ అంశాలు వెల్లడించింది.



2021లో ప్రపంచవ్యాప్తంగా 22 కోట్ల మందిని పరీక్షించారు. ప్రపంచవ్యాప్తంగా రోగ నిర్ధారణ, చికిత్స, వ్యాధి భారంపై కరోనా మహమ్మారి ప్రభావాన్ని పరిశీలించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ పరిశోధనను నిర్వహించింది.డబ్ల్యూహెచ్‌వో నివేదిక ప్రకారం.. 2022 దీనిని తీవ్రంగా పరిగణించింది. భారత ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలని కోరింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, ప్రభుత్వ చొరవ ప్రధాన్ మంత్రి టిబి ముక్త్ భారత్ అభియాన్ కింద దేశవ్యాప్తంగా 40 వేల మందికి పైగా నిక్షయ్ మిత్రలు ప్రస్తుతం 10.45 లక్షల మంది టిబి రోగులకు సహాయం చేస్తున్నారు. ఈ నివేదికను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం ఇతర దేశాల కంటే భారతదేశం మెరుగ్గా ఉందని పేర్కొంది..ప్రభుత్వ ఆసుపత్రుల్లో దీని చికిత్స ఉచితంగా అందించబడుతుంది. ఈ వ్యాధిని నిర్మూలించేందుకు ప్రభుత్వం వ్యాక్సిన్‌ను కూడా సిద్ధం చేస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా టీబీ పరీక్షలు చేస్తారు..


ఈ వ్యాధి లక్షణాలు ఏంటో తెలుసా?


విపరీతమైన దగ్గు, కొన్నిసార్లు రక్తం కూడా పడుతుంది. ఆకలి, శ్వాస ఆడకపోవడం, బరువు తగ్గడం, సాయంత్రం వచ్చే జ్వరం, తీవ్రమైన ఛాతీ నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే ఖచ్చితంగా పరీక్షలు చేయించుకోవాలి.ఈ బాక్టీరియా శరీరంలోని ఏదైనా భాగపు కణజాలాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. శరీర అవయవం పనితీరును ప్రభావితం చేస్తుంది. ఊపిరితిత్తుల్లో టీబీ ఉంటే క్రమంగా వాటిని క్షిణింపజేస్తుంది. గర్భాశయంలో ఉంటే సంతానలేమి, ఎముకల్లో ఉంటే ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలు..సొయాబీన్స్,, చేపలు, గుడ్లు, చీజ్ మొదలగు ప్రోటిన్ ఫుడ్ ను తీసుకోవడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: