200 కోట్ల కుంభకోణం కేసులో హాట్ బ్యూటీకి రిలీఫ్?

Purushottham Vinay
రాన్ బాక్సీ ప్రమోటర్లకు బెయిల్ ఇప్పిస్తానంటూ సుఖేష్ గతంలో రూ.200 కోట్లు వారి వద్దనుంచి తీసుకొని మోసం చేశాడు. మాజీ సీఎం కొడుకును అంటూ పీఎంవో అధికారిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నమ్మించి ఈ పనిచేశారు. సుఖేష్ తో జాక్వెలిన్ కు ఉన్న ఎఫైర్ కారణంగా ఆమె ఈ కేసులో బుక్కైంది. ఇతడితో సన్నిహిత సంబంధాల మూలంగా జాక్వెలిన్ కూడా కేసులో ఇరుక్కుంది. ఈడీ ఇప్పటికే పలుమార్లు విచారించింది.సుకేష్ కుంభకోణంలో జాక్వెలైన్ కు ఆర్థిక సంబంధాలున్నాయని ఈడీ తేల్చింది. జాక్వెలిన్ స్టైలిష్ట్ అయిన 'లేపాక్షి ఎల్లవాడి'ని 8 గంటల పాటు విచారించారు. ఈ సందర్భంగా సుఖేష్ జాక్వెలిన్ లు సహజీవనం చేశారని లేపాక్షి తెలిపినట్టు సమాచారం. ఇక 200 కోట్ల కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు అయిన సుఖేష్ చంద్రశేఖర్ నుంచి 7 కోట్ల రూపాయల విలువైన వస్తువులను బహుమతులుగా అందుకుంటున్న ఆరోపణలు ఎదుర్కొంటున్న జాక్వెలిన్ ప్రస్తుతం టెంపరరీ బెయిల్ పై ఉన్నారు.రెగ్యులర్ బెయిల్ పిటీషన్ పై విచారణ కోసం తన లాయర్ తో కలిసి ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టుకు జాక్వెలిన్ హాజరయ్యారు.


రెగ్యులర్ బెయిల్ పిటీషన్ ను వచ్చేనెల 10న విచారిస్తామన్న కోర్టు.. అప్పటివరకూ ఆమె టెంపరరీ బెయిల్ ను పొడిగిస్తూ ఊరట కల్పించింది.మొత్తం రూ.200 కోట్ల దోపిడీ కేసులో ఆర్థిక నేరస్థుడు సుఖేష్ చంద్రశేఖర్ తో కలిసి కేసులో ఇరుక్కున్న బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కు ఇప్పటికే కోర్టులో ఆమెకు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కానీ కొన్ని షరతులు పెట్టి ట్విస్ట్ ఇచ్చింది. జాక్వెలిన్ కు 50వేల రూపాయిల బాండ్ పేపర్ తో కూడిన టెంపరరీ బెయిల్ ను కోర్టు మంజూరు చేసింది.ఈ కేసు నుంచి బయటపడేందుకు జాక్వెలిన్ పెద్ద పెద్ద లాయర్లతో కలిసి తీవ్రంగా ప్రయత్నించింది. సోమవారం ఈ కేసు విచారణలో భాగంగా జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కోర్టుకు హాజరైంది. పాటియాల హౌస్ కోర్టు ఈ కేసులో జాక్వెలిన్ కు షరతులతో కూడిన తాత్కాలిక బెయిల్ ను మంజూరు చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 22కు వాయిదా వేసింది.ఈరోజు కేసును వాయిదా వేస్తూ మరోసారి బెయిల్ ను పొడిగించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: