పోస్టాఫీసు సూపర్ స్కీమ్..రూ.399తో రూ.10 లక్షల భీమా..పూర్తి వివరాలివే..

Satvika
పొదుపు పథకాలలో పోస్టాఫీసు బెస్ట్ పథకాలను అందిస్తూ వస్తుంది.తక్కువ పెట్టుబడి తో ఎక్కువ లాభాలను పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.. అందుకే రోజు రోజుకు ఈ పథకాలకు ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తుంది.ఆరోగ్య బీమా చేయించుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది.. అంతే కాకుండా.. ఇంట్లో ఉన్న ఫ్యామిలీ ప్యాకేజ్ బీమాతో పాటు.. వ్యక్తిగతంగా కూడా బీమా తీసుకుంటున్నారు. ఇలాంటి సౌకర్యాలు కల్పించే బీమా సంస్థలు చాలనే ఉన్నాయి. ఆ కోవలోనే ఇండియో పోస్ట్ ఆఫీస్ కూడా చేరింది.

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌ ప్రత్యేక యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకొచ్చింది. ఈ గ్రూప్ యాక్సిడెంటల్ పాలసీ కోసం టాటా AIGతో కలిసి పని చేస్తోంది.సంవత్సరానికి రూ. 299, రూ. 399 ప్రీమియంతో ఈ బీమా పాలసీలు ఉన్నాయి. దీంతో దాదాపు రూ. 10 లక్షల బీమా పొందవచ్చు. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఖాతాదారులకు ఈ పథకం అందుబాటులో ఉంటుంది.IPD ఖర్చుల కోసం రూ. 60 వేలు, ప్రమాదవశాత్తు గాయం అయితే OPD కోసం రూ. 30 వేలు ఇస్తారు. ఖాతాదారుడు ప్రమాదంలో మరణిస్తే అంత్యక్రియల కోసం ఆధారపడిన వారికి రూ. 5,000 సహాయం, పిల్లల చదువు కోసం రూ. 1 లక్ష పరిహారం అందిస్తుంది.

దీనితో పాటు రవాణా ఖర్చు కూడా అందుబాటులో ఉంటుంది. ప్రమాదంలో ఒక వేళ అంగవైకల్యం చెందితే.. ఖాతాదారునికి రూ.10 లక్షల పరిహారం అందుతుంది. రూ.299 పాలసీలో కూడా రూ.399లో ఉన్న సౌకర్యాలు ఉటాయి. కానీ, ఈ రెండు పథకాల మధ్య ఒకే ఒక్క తేడా ఉంది..రూ.299 ప్రమాద రక్షణ పథకంలో మరణించిన వారిపై ఆధారపడిన వారి పిల్లల చదువుకు సహాయం మొత్తం అందుబాటులో ఉండదు. మిగతా సౌకర్యాలన్నీ ఉంటాయి.అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరినా ఇన్సురెన్స్ వర్తిస్తుంది. దీంతో ప్రజలు అధికసంఖ్యలో బీమా చేయించుకుంటున్నారు. ఖాతాదారుడి వయస్సు 18 నుంచి 65 ఏళ్ల మధ్య ఉండాలి. వివరాలకు స్థానిక పోస్ట్ ఆఫీసును సంప్రదించండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: