అమరావతి : కావాలనే జూనియర్ ను కెలికిన చంద్రబాబు

Vijaya






ఎన్నికలు దగ్గరపడేకొద్దీ చంద్రబాబునాయుడు, తమ్ముళ్ళు+ఐ టీడీపీ ఎందుకనో జూనియర్ ఎన్టీయార్ ను బాగా  కెలుక్కుంటున్నారు. బహుశా జూనియర్ ఆమధ్య కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో భేటీ అవటాన్ని యావత్తు పచ్చబ్యాచ్ తట్టుకోలేకపోతున్నట్లుంది. చంద్రబాబు ఎంతడిగినా అపాయిట్మెంట్ ఇవ్వని అమిత్ షా తనంతట తానుగా కోరి జూనియర్ను డిన్నర్ మీటింగ్ కు ఆహ్వానించటాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నట్లున్నారు.



అందుకనే అవసరంఉన్నా లేకపోయినా, ప్రతివిషయంలో కావాలనే జూనియర్ ను లాగుతున్నారు. ఇదంతా ఇపుడు ఎందుకంటే బాలకృష్ణ చేస్తున్న టాక్ షో లో చంద్రబాబు మాట్లాడారు. వెన్నుపోటు ఘటనను 1995 సంక్షోభంగా చంద్రబాబు అభివర్ణిస్తు బాలయ్యను ఉద్దేశించి  ‘ఆరోజు నేను, నువ్వు, హరికృష్ణ, బీవీ మోహన్ రెడ్డే కదా ఎన్టీయార్ దగ్గరకు వెళ్ళింది’ అని అడిగారు. నిజానికి చంద్రబాబు-బాలయ్య మధ్య టాక్ షో లో హరికృష్ణను లాగాల్సిన అవసరంలేదు.



ఎన్టీయార్ కు చంద్రబాబు వెన్నుపోటు పొడవటంలో ఎన్టీయార్ సంతానం మద్దతుందన్న విషయం అందరికీ తెలుసు. అయితే వెన్నుపోటు అనగానే అందరికీ గుర్తుకొచ్చేది చంద్రబాబు మాత్రమే. ఇలాంటి ఘటనలో చంద్రబాబు వ్యూహాత్మకంగా హరికృష్ణ పేరును ప్రస్తావించినట్లే ఉంది. ఎన్టీయార్ కు వెన్నుపోటు పొడవటంలో  తానొక్కడే కాదని బాలయ్య, హరికృష్ణ కూడా పాత్రదారులే అని చంద్రబాబు చెప్పినట్లయ్యింది. ఇక్కడ హరికృష్ణను పేరు లాగటం వల్ల మండేది ఎవరికయ్యా అంటే కల్యాణరామ్, జూనియర్ ఎన్టీయార్ కే. వీళ్ళిద్దరిలో కూడా జూనియర్ ముఖ్యం.




ఎందుకంటే రాజకీయాలకు కల్యాణ్ రామ్ పూర్తిగా దూరంగా ఉంటే జూనియర్ కే బాగారాజకీయవాసనలున్నాయి కాబట్టి. ఒకపుడు టీడీపీ తరపున చాలా యాక్టివ్ గా ప్రచారం చేశారు. చంద్రబాబు కారణంగానే టీడీపీకి జూనియర్ దూరమైపోయారు. తాను బీజేపీకి దగ్గరవుతున్నారనే అనుమానం ఉందేమో అందుకనే వెన్నుపోటు ఘటనలో కావాలనే జూనియర్ తండ్రి హరికృష్ణ పేరును తెచ్చారు. ఎందుకంటే చంద్రబాబు ఏమి మాట్లాడినా ఊరికే మాట్లాడేరకం కాదు. మరి దీని ప్రభావం ముందు ముందు ఎలాగుంటుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: