కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక ఫలితం: అందలం ఎక్కారు... స్వారీ సులభమా !

VAMSI
స్వాతంత్య్రం రాక ముందు నుండి ఇండియాలో పెద్దదైన రాజకీయ పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ అని చెప్పాలి. ఈ పార్టీకి మొత్తం 137 సంవత్సరాల చరిత్ర ఉంది. కానీ దీని ప్రస్థానం నుండి నిన్నటి వరకు కూడా పార్టీని పాలించింది మాత్రం గాంధీ కుటుంబీకులే కావడం విశేషం. కానీ ఒకానొక సమయంలో కొందరు అగ్ర వర్గాలకు చెందిన నాయకులు కూడా అధ్యక్షులుగా పనిచేశారని తెలుస్తోంది. తాజాగా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక రెండు రోజుల క్రితం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలో అధ్యక్ష పదవి కోసం కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజ్యసభ ఎంపీ మల్లికార్జున ఖర్గే మరియు కేరళకు చెందిన ఎంపీ శశి థరూర్ లు పోటీ పడ్డారు.
అయితే మొదటి నుండి మల్లికార్జున ఖర్గేకు గాంధీ కుటుంబం నుండి మద్దతు ఉండడం ఈ ఎన్నికకు బాగా కలిసి వచ్చింది. ఈ రోజు వెలువడిన ఆ ఫలితంలో మల్లికార్జున ఖర్గే ఘనవిజయం సాధించారు. ప్రస్తుతం 83 సంవత్సరాలు ఉన్న ఖర్గే కు ఈ పదవి చాలా సవాలుతో కూడుకున్నది అని చెప్పాలి.  కానీ నేతల నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ విజయం ముందుగానే ఊహించమని అంటున్నారు. కాగా కాంగ్రెస్ అధ్యక్షుడిగా అందలం అయితే ఎక్కారు... కానీ స్వారీ అంత సులభం కానుందా అన్నది ఇపుడు చూడాలి. ఈయన పదవీకాలం అయిదు సంవత్సరాలు గా ఉండనుంది. ఈ మార్గంలో అనేక సవాళ్ళను మల్లికార్జున ఖర్గే అధిగమించాల్సి ఉంటుంది.
అందులో భాగంగా,
* పార్టీలో నాయకులు అంతా ఒకతాటి పైన లేరు.. ముందుగా అన్ని రాష్ట్రాల అధ్యక్షులతో ఒక సమావేశం నిర్వహించి పార్టీలో ఐక్యతను తీసుకురావాలి. వీరికి పార్టీ బాధ్యతను తెలియచేసి తమ తమ రాష్ట్రాల  ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ఏమి చెయ్యాలో ఒక ప్రణాళికను రచించుకోవాలి.
* కాంగ్రెస్ లో అనాదిగా పాతుకుపోయిన అసమ్మతి వర్గాల జూలు విదిలించాలి. ఏ పార్టీ అయినా అసమ్మతి వర్గం ఉండడం సహజం. కానీ అది ఎక్కువ అయినప్పుడే పార్టీకి చాలా ప్రమాదం.
* ఇక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉన్న ఈ తక్కువ సమయంలో... కాంగ్రెస్ ను విజయపథం వైపుకు నడిపించాలి.
* ప్రతి రాష్ట్రంలో అడ్డుగా ఉన్న బీజేపీ ని అడ్డుకోవాలి... ఇక ప్రధాని నరేంద్ర మోదీ మరియు హోమ్ మినిస్టర్ అమిత్ షా ల వ్యూహాలను ముందుగానే ఊహించి తిప్పికొట్టాలి.
* ప్రస్తుతం అధికారంలో ఉన్న రాజస్థాన్ మరియు ఛత్తీస్ ఘడ్ లను బీజేపీ వ్యూహాలకు బలి కాకుండా కాపాడుకోవాలి.
*  కాగా అతి త్వరలోనే హిమాచల్ ప్రదేశ్ మరియు గుజరాత్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించడానికి శాయశక్తులా ప్రయత్నించాలి.
ఇలా ఎన్నో సవాళ్లు మల్లికార్జున ఖర్గే నూతన అధ్యక్షుడిగా ఎదుర్కోవలసి వస్తుంది. మరి ఏ మేరకు పార్టీని నడిపిస్తాడు అన్నది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: