కాంగ్రెస్: ఎన్నికల కోసం ఏర్పాట్లు పూర్తి.. అధ్యక్షుడు ఎవరు?

Purushottham Vinay
కాంగ్రెస్: ఎన్నికల కోసం ఏర్పాట్లు పూర్తి.. అధ్యక్షుడు ఎవరు ?
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. సోమవారం (అక్టోబర్ 17) ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ అనేది జరగనుంది.ఈ మేరకు ఏఐసీసీ అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి కోసం మల్లికార్జున్‌ ఖర్గే, శశిథరూర్‌ పోటీ పడుతున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ దేశవ్యాప్తంగా 36 పోలింగ్ స్టేషన్లలో 67 పోలింగ్ బూత్‌ల ఏర్పాటు చేసింది. 9,300 మందికి పైగా ప్రతినిధులు పార్టీ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ప్రతి రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గానికి ఇద్దరు చొప్పున ప్రతినిధులు ఓటు వేయనున్నారు. ఢిల్లీ, ముంబై లాంటి మెట్రో నగరాల్లో మున్సిపల్ సీటు ప్రాతిపదికన ప్రతినిధులను ఎంపిక చేశారు. ప్రతి పోలింగ్ బూత్ లో గరిష్టంగా 200 మంది ఓటు వేసే అవకాశం ఉంది. 


భారత్ జోడోయాత్రలో భాగంగా ప్రత్యేకంగా యాత్ర క్యాంపు వద్ద ఒక బూత్ ఏర్పాటు చేశారు. రాహుల్ గాంధీతో పాటు యాత్రలో ఉన్న ఏఐసీసీ నేతలు క్యాంపు బూత్‌లోనే ఓటు వేయనున్నారు.ఓటింగ్‌ పూర్తయిన తరువాత బ్యాలెట్ బాక్సులు ఢిల్లీకి తరలించి, ఈనెల 19న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అదేరోజు ఫలితాన్ని వెలువరించనున్నారు.ఇక తెలంగాణ రాష్ట్రంలో ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల కోసం హైదరాబాద్‌ గాంధీభవన్ లో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. తెలంగాణ పీసీసీ సభ్యులు గాంధీ భవన్‌లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. తెలంగాణ లో 238 మంది ఓటర్లు ఉన్నారు. ఏఐసిసి ఎన్నికల ఇన్‌ఛార్జులుగా తెలంగాణకు రాజ్ మనోహర్ ఉన్నితన్, రాజ బగేల్ చేరుకున్నారు. రాజ్ మనోహర్ ఉన్నితన్ పీఆర్వోగా.. రాజ బగేల్ ఏపీఆర్వో వ్యవహరించనున్నారు. ఖర్గే తరుపున ఎన్నికల ఏజెంట్లుగా షబ్బీర్ అలీ, మల్లు రవి వ్యవహరించనున్నారు.ఇక మరి చూడాలి మున్ముందు ఏం జరుగుతుందో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: