గుడ్ న్యూస్..మీ డబ్బులను రెట్టింపు చేసే పోస్టాఫీసు స్కీమ్..!!

Satvika
ప్రజలందరికీ పోస్టాఫీసు ఎన్నో రకాల స్కీమ్ లను అందిస్తుంది..అందులో కొన్ని స్కీమ్ లు ప్రజలకు అధిక లాభాలను తెచ్చి పెడుతున్నాయి..ఆ స్కీమ్ లకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది..పోస్టాఫీసు స్కీంలు చిన్న, మధ్య తరగతి ప్రజలకి అనువుగా ఉంటాయి.గ్రామీణ ప్రజలకి పోస్టాఫీసు పథకం లాభదాయకమైన పెట్టుబడి. రోజుకి రూ.170 పెట్టుబడి పెడితే మెచ్యూరిటీలో రూ.19 లక్షలు సంపాదించే ఒక పోస్టాఫీసు పథకం ఉంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ పోస్టాఫీసు పథకం గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకి బాగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు..గ్రామ్ సుమంగల్ రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్'. ఈ పథకంలో మీరు రోజుకు రూ.170 ఆదా చేస్తే రూ.19 లక్షల వరకు పొందవచ్చు. పాలసీ హోల్డర్ మనుగడపై మనీ బ్యాక్ ప్రయోజనం అందుబాటులో ఉంది. అంటే మీరు పెట్టిన పెట్టుబడి కూడా పూర్తిగా వాపసు వస్తుంది. గ్రామ సుమంగల్ యోజనలో పాలసీదారు మెచ్యూరిటీపై బోనస్ పొందుతారు. ఈ పథకాన్ని 15 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు తీసుకోవచ్చు. 19 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వారు ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. భారతీయ పౌరులు ఎవరైనా దీనిని సద్వినియోగం చేసుకోవచ్చు.గ్రామ సుమంగల్ పథకాన్ని ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం. మీకు 25 ఏళ్లు అనుకుందాం. 10 లక్షల హామీ మొత్తాన్ని కొనుగోలు చేస్తారు. పాలసీ వ్యవధిని 15 సంవత్సరాల పాటు ఉంచినట్లయితే నికర నెలవారీ ప్రీమియం రూ.6793 అవుతుంది. పాలసీ వ్యవధిని 20 సంవత్సరాలు ఉంచినట్లయితే నెలవారీ ప్రీమియం రూ.5121 అంటే రోజుకు రూ.170 అవుతుంది. 20 ఏళ్ల పాలసీ తీసుకున్న వారికి 8 ఏళ్లు, 12 ఏళ్లు, 16 ఏళ్ల వ్యవధిలో 20-20% చొప్పున డబ్బు తిరిగి వస్తుంది. మిగిలిన 40 శాతం డబ్బు బోనస్‌తో పాటు మెచ్యూరిటీపై వస్తుంది. పాలసీదారు మరణించినప్పుడు నామినీకి బోనస్ మొత్తంతో పాటు హామీ మొత్తం చెల్లిస్తారు..15 సంవత్సరాల మొత్తానికి ప్రీమియం 6.75 లక్షలు రాగా,20 ఏళ్లకు 9 లక్షలు. హామీ మొత్తం రూ.10 లక్షలు కాబట్టి 15 సంవత్సరాల తర్వాత మొత్తం ప్రయోజనం రూ.16.75 లక్షలు అవుతుంది. 20 ఏళ్ల తర్వాత మెచ్యూరిటీ మొత్తం రూ.19 లక్షలను పొందవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: