జగన్ గుడ్ న్యూస్..వారి అకౌంట్ లోకి లక్ష రూపాయలు..

Satvika
పాద యాత్ర సమయంలో జగన్ ఎవైతే వాగ్దానాలు చేశాడో వాటిని ఒక్కొక్కటిగా నేరవేరుస్తున్నారు..ఇప్పటికే ఎన్నో పథకాలను అమలు చేశారు.గతంలో ఏ సీఎం చేయనటువంటి పథకాలను అందుబాటులోకి తీసుకొని వస్తున్నాడు.కొత్త కొత్త పథకాలు అందిస్తున్నారు. గతంలో ప్రకటించిన వారికి సైతం విరామం లేకుండా విడతల వారిగా నిధులు విడుదల చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు రెండు పథకాలకు శ్రీకారం చడుతున్నారు. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి వైఎస్సార్ కళ్యాణమస్తు వైఎస్సార్ షాదీ తోఫా లను ప్రారంభిస్తున్నారు.

ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా" వెబ్ సైట్ ప్రారంభం అయ్యింది. ఈ పథకాల ద్వారా కేవలం పేద ఆడపిల్లలకు ఆర్థిక సాయం చేయడం ఒక్కటే కాదు..ఈ పథకం ఉద్దేశ్యం..పిల్లల చదువును ప్రోత్సహించడం, బాల్య వివాహాల నివారణ, పాఠశాలల్లో చేరికల శాతం పెంచడం.. అలాగే డ్రాపౌట్ రేట్ ను తగ్గించడం.. ఈ కారణాలతో పాటు పెళ్లిళ్లు చేయలేక ఇబ్బంది పడుతున్న పేద తల్లిదండ్రులకు అండగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది..

దరఖాస్తు చేసుకునే వధూవరులిరువురుకీ టెన్త్ క్లాస్ ఉత్తీర్ణత తప్పనిసరి చేశారు. అలా చేయడంతో పిల్లల చదువును ప్రోత్సహించడం.. బాల్య వివాహాలను నివారించడం.. పాఠశాలల్లో చేరికల శాతాన్ని పెంచడం.. డ్రాపౌట్ రేట్ ను తగ్గించడం జరుగుతాయన్న విషయాన్ని స్వయంగా సీఎం చెప్పారు.వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాలను రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.కాగా, నేటి నుంచే ఈ పథకం అమల్లొకి రానుంది.ఎస్సీ, ఎస్టీ వధూవరులకు లక్ష, ఒకవేళ వీరు కులాంతర వివాహం చేసుకుంటే 1.20 లక్షలు ఇస్తారు. బీసీలకు 50 వేలు, వీరు కులాంతర వివాహం చేసుకుంటే 75 వేల ఆర్థిక సాయం ఉంటుంది. మైనార్టీలకు లక్ష, దివ్యాంగులైతే 1.50 లక్షలు ఇస్తారు. భవన నిర్మాణ కార్మికులకు 40 వేల సాయాన్ని అందిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: