మునుగోడు ఉప ఎన్నికపై కీలక అప్డేట్ ?

VAMSI
తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం మంచి జోరుమీదున్నాయి. ఒకవైపు వచ్చే ఎన్నికల కోసం రాష్ట్రం లోని అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటి నుండే వ్యూహాలు సిద్ధం చేసుకుంటుంటే.. మరో వైపు మునుగోడు ఉప ఎన్నికలో గెలుపు కోసం ప్రణాళికలు రచించుకుంటున్నారు. గత నెలలో కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా మునుగోడు నియోజకవర్గం నుండి గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజకీయంగా ఎదుగుదల కోసం తన పదవికి మరియు పార్టీకి రాజీనామా చేసి జాతీయ పార్టీ అయిన బీజేపీలోకి అమిత్ షా సమక్షములో వెళ్లిన సంగతి తెలిసిందే. వాస్తవంగా చూస్తే ఈ ఉప ఎన్నిక ఫలితం కోసం చాలా ఈగర్ గా అందరూ వెయిట్ చేస్తున్నారు.
కాగా ఈ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అన్న విషయం ఇంకా అధికారికంగా ఎన్నికల సంఘం నుండి ఎలాంటి ప్రకటన వెలువడింది లేదు. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం తాజగా కేంద్ర ఎన్నికల సంఘం నుండి మునుగోడు ఉప ఎన్నిక గురించి కీలక ప్రకటన వచ్చిందట. ఈ ఉప ఎన్నిక గురించి కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఒక సందేశం వేసినట్లుగా తెలుస్తోంది. దసరా పండుగ అనంతరం ఈ ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేయడానికి ప్రణాళికలు జరుగుతున్నాయట.
ఆ విధంగా చూస్తే ఎన్నికల సంఘం ప్లాన్ ప్రకారం నవంబర్ లో ఎన్నికలు జరుగుతాయట. అంతే కాకుండా  ప్రణాళిక ప్రకారం ఎన్నికలు జరగడానికి తగిన ఏర్పాట్లు చూసుకోవాలని తెలంగాణ ఎన్నికల సంఘానికి మరియు నల్గొండ జిల్లా కలెక్టర్ కు సూచనలు వెళ్లాయట. ఇక ఎన్నికలు అంటే ఈవీఎం లు ఏర్పాటు, పోలింగ్ సెంటర్ ల ఏర్పాటు లాంటి పనులను చేసుకోవాల్సిందిగా కలెక్టర్ కు సమాచారం వెళ్లిందట. మాములుగా ఈ ఏడాది చివర్లో గుజరాత్ మరియు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్నాయి. వాటితో పాటుగా మునుగోడు ఉప ఎన్నికను జరిగేలా ప్లాన్ చేస్తున్నారు. మరి ఎన్నికలలో ఎవరు గెలుస్తారు ? ఏమి జరుగుతుంది అన్నది తెలియాల్సి ఉంది.  
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: