ఎస్బీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్..ఇలా చేస్తే ఆ చార్జీలు వర్తించవు..!!

Satvika
ప్రముఖ దేశీయ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు ఎప్పటికప్పుడు గుడ్ న్యూస్ ను చెబుతూ వస్తుంది. ఆర్బీఐ నియమాలను అనుసరించి కొత్త రూల్స్ ను అమలు చేస్తూ వస్తుంది.ఇప్పుడు వినియోగదారులకు మరో గుడ్ న్యూస్ ను చెప్పింది.ఎలాంటి టిక్కెట్ ఆన్లైన్లో చేసుకోవాలన్న తడిసిమోపెడవుతుంది. ఎందుకంటే సర్వీస్ ఛార్జ్ అని, ఆ ఛార్జ్ అని.. ఈ ఛార్జ్ అని చెప్పి బాగా గుంజుతున్నారు.ఈ క్రమంలో దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన sbi తన కస్టమర్లకు ఓ శుభవార్త చెప్పింది. పండగ సీజన్‌ షురూ కావడంతో తన కస్టమర్లు చౌకగా ట్రైన్ టిక్కెట్లను పొందేవీలుగా ఓ ఆఫర్‌ను sbi తీసుకొచ్చింది.

 ఈ విషయాన్ని sbi నోటిఫికేషన్ ద్వారా తన కస్టమర్లకు తెలిపింది. యోనో యాప్ ద్వారా రైల్వే టిక్కెట్లను చౌకగా పొందవచ్చని కస్టమర్లకు పంపిన ఈ నోటిఫికేషన్‌లో sbi పేర్కోవడం విశేషం..SBI yono App ద్వారా irctc సైటుపై ట్రైన్ టిక్కెట్లను బుక్ చేసుకుంటే.. ఆ కస్టమర్లకు ఎలాంటి గేట్‌వే ఛార్జీలు వర్తించవని పేర్కొంది. బేసిగ్గా irctc వెబ్‌సైట్‌పై ట్రైన్ టిక్కెట్లను బుక్ చేసుకునేటప్పుడు, అన్ని గేట్‌వే కంపెనీలు రూ.30 వరకు ఛార్జీలను విధిస్తూ ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసినదే.

అయితే sbi యోనో యాప్ ద్వారా టికెట్ చేసుకుంటే ఈ ఛార్జీలు జీరో. ఇకపోతే లోన్ అప్లికేషన్లను, నగదు లావాదేవీలను, చెక్ బుక్, కార్డుకి సంబంధించిన సర్వీసులను ఈ యాప్ ద్వారానే sbi నిర్వహిస్తోందన్న సంగతి విదితమే. అయితే ఇపుడు ట్రైన్ టిక్కెట్లను ఎలా బుక్ చేసుకోవాలో చూద్దాము...SBI యోనో యాప్ ఓపెన్ చేసుకోండి. ఆ తర్వాత బుక్ అండ్ ఆర్డర్ సెక్షన్‌లోకి వెళ్లాలి. తరువాత అక్కడ మీరు irctc ఐకాన్ చూస్తారు. దాన్ని నొక్కితే, irctc లాగిన్ పేజీ ఓపెన్ అవుతుంది. తరువాత మీ లాగిన్ ఐడీతో దానిలోకి లాగిన్ అయిన తరువాత టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి కావాల్సిన సమాచారాన్ని ఇవ్వండి. ఆ తర్వాత.. పేమెంట్ పేజీలోకి వెళ్తుంది. చెల్లింపు చేసేందుకు మీ కార్డు లేదా బ్యాంకు అకౌంట్ వివరాలను ఇవ్వాలి. యాప్‌పై టిక్కెట్ బుకింగ్‌కు చెల్లింపులు చేస్తుండటంతో ఎలాంటి పేమెంట్ గేట్‌వే ఛార్జీలను వెయ్యదు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: