రాయలసీమ : చంద్రబాబుపై డైరెక్ట్ ఎటాకేనా ?

Vijaya


కుప్పంలో జరిగిన బహిరంగసభలో చంద్రబాబునాయుడుపై జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ ఎటాక్ చేశారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ మొదటిసారి కుప్పంలో పర్యటించారు. సుమారు 20 నిముషాలు మాట్లాడిన జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు తమ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమపథకాలను వివరించారు. వైఎస్సార్ చేయూత పథకంలో లబ్దిదారుల ఖాతాల్లో జమకావాల్సిన రు. 4949 కోట్లకు బటన్ నొక్కి విడుదల చేశారు.ప్రభుత్వం చేస్తున్న, చేయబోయే కార్యక్రమాల గురించి వివరించిన జగన్ తర్వాత చంద్రబాబు మీద ఆరోపణలు ఎక్కుపెట్టారు. చంద్రబాబు హైదరాబాద్ కు లోకల్ కుప్పానికి నాన్ లోకల్ అంటు ఎద్దేవాచేశారు. 33 ఏళ్ళుగా కుప్పంనుండి తనకు కావాల్సింది తీసుకుంటున్నారే కానీ కుప్పానికి ఏమీ ఇవ్వలేదంటు మండిపడ్డారు. కుప్పం ప్రజలకు అందించాల్సిన మంచినీటి సౌకర్యాన్ని అందించటంలో కూడా చంద్రబాబు ఫెయిలైనట్లు మండిపడ్డారు.చంద్రబాబు అంటే దొంగఓట్లు, వెన్నుపోట్లు మాత్రమే అంటే ఎద్దేవాచేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీచేయబోతున్న ఎంఎల్సీ భరత్ కు ఓట్లేసి గెలిపించాలని విజ్ఞప్తిచేశారు. కుప్పం ప్రజలు భరత్ ను గెలిపిస్తే తాను మంత్రిని చేస్తానని హామీ ఇచ్చారు. ఎంఎల్సీ హోదాలోనే భరత్ నియోజకవర్గంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలను తనతో చేయిస్తున్నారని చెప్పారు. కుప్పంకు చంద్రబాబు ఏం చేసాడంటే ఏమీలేదన్నారు. కానీ తమప్రభుత్వం వచ్చిన తర్వాత అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.ఇక్కడ గమనించాల్సిందేమంటే జనాలకు డైరెక్టు కాంటాక్టు విషయంలో చంద్రబాబు ఫెయిలవుతుంటారు. చెప్పాల్సింది డైరెక్టుగా చెప్పకుండా ఏదేదో సోది చెప్పి విసిగించేస్తారు. ఇదే సమయంలో జగన్ మాత్రం తాను చెప్పాల్సింది సూటిగా సుత్తిలేకుండా చెప్పేస్తారు. చంద్రబాబు ఎక్కడ మాట్లాడినా గంటన్నరకు తక్కువ కాకుండా మాట్లాడుతారు. అదే జగన్ 15 లేదా 20 నిముషాలకు మించి మాట్లాడరు. ఇక్కడే చంద్రబాబు, జగన్ మధ్య జనాలు పోలిక చూసుకుంటున్నారు. జగన్ వచ్చిన సందర్భంగా జరిగిన బహిరంగసభ కూడా గ్రాండ్ సక్సెస్ అయ్యింది. మహిళలు, యువత ఎక్కువగా కనిపించారు. సో జరగాల్సిందేమిటో ఇక ఎన్నికలే డిసైడ్ చేస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: