రాయలసీమ : ఈమె చంద్రబాబునే బ్లాక్ మెయిల్ చేస్తున్నారా ?

Vijaya


ఇపుడీ విషయమే జిల్లాతో పాటు పార్టీలోను చర్చనీయాంశమవుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే కర్నూలు జిల్లాలోని ఆళ్ళగడ్డ నేత, మాజీమంత్రి భూమా అఖిలప్రియ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారారు. ఈమె వచ్చే ఎన్నికల్లో ఆళ్ళగడ్డ నుండి కాక నంద్యాల నియోజకవర్గంలో పోటీచేయాలని అనుకున్నారు. అనుకున్నదే ఆలస్యం వెంటనే నంద్యాలలో సొంతంగా పార్టీ ఆఫీసును ఏర్పాటు చేసుకోవాలని అనుకున్నారు.అఖిల ఆలోచన తెలియగానే నంద్యాల మాజీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్, మాజీ ఎంఎల్ఏ భూమా బ్రహ్మానందరెడ్డి, సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. అయినా ఆమె పట్టించుకోలేదు. పార్టీ ఆఫీసుకోసం మంచి బిల్డింగును వెతుక్కున్నారు. అఖిల నంద్యాలలో తిష్టవేస్తే తమకు ఇబ్బందులు తప్పవన్న ఉద్దేశ్యంతో వీళ్ళ ముగ్గురు చంద్రబాబునాయుడు, లోకేష్ తో విషయాన్ని చెప్పారు.  వీళ్ళ ఫీడ్ బ్యాక్ ఆధారంగా అఖిలతో నేరుగా చంద్రబాబే మాట్లాడారట.నంద్యాలలో పార్టీ ఆఫీసు పెట్టవద్దని స్పష్టంగా చెప్పారట. అయినా అఖిల వినకుండా ఆఫీసును ఓపెన్ చేశారట. అంటే లోకల్ నేతలు కాదు స్వయంగా చంద్రబాబే చెప్పినా కూడా అఖిల వినలేదు. ఇదంతా అఖిల ఎందుకు చేస్తున్నట్లు ? ఎందుకంటే జిల్లాలోని కొందరికి వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఫైనల్ చేసిన చంద్రబాబు ఆళ్ళగడ్డలో ఆమెకు మాత్రం ఫైనల్ చేయలేదట. అంటే ఒకరకంగా చంద్రబాబునే అఖిల బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు లెక్క. అయితే ఈమె ఆలోచన గ్రహించిన చంద్రబాబు ఈమెను పట్టించుకోవటం మానేశారట.దాంతో ఇపుడు సమస్య ఎంతదాకా వెళ్ళిందట తనకు గనుక ఆళ్ళగడ్డలో టికెట్ ఇవ్వకపోతే ఆళ్ళగడ్డతో పాటు నంద్యాలలో కూడా టీడీపీ ఎలా గెలుస్తుందో చూస్తానని చాలెంజ్ చేసేవరకు వ్యవహారం చేరుకున్నదట. దాంతో ఏమి చేయాలో అర్ధంకాక లోకల్ నేతలతో పాటు చంద్రబాబు కూడా తలపట్టుకున్నట్లు సమాచారం. ఎక్కడా టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా పోటీచేస్తారా ? లేకపోతే ఇంకేదన్నా పార్టీలో చేరి పోటీచేస్తారా అన్న విషయాన్ని అఖిల చెప్పటంలేదు. మరి చివరకు ఏమి జరుగుందనేది సస్పెన్సుగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: