కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ఉప ఎన్నిక కుంపటి... భవిష్యత్తు ఏంటి ?

VAMSI
కొన్ని సార్లు అనుకున్నవి మనకు అనుకూలంగా జరగవు, పైగా మనకే రివర్స్ లో తగులుతూ ఉంటాయి. ఆ దెబ్బకు మళ్ళీ కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. అందుకే ఆచితూచి అడుగులు వేయాలి.. ఏదైనా పెద్ద స్టెప్ తీసుకునేటప్పుడు పది సంవత్సరాలు ముందుకు వెళ్లి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అయితే ఇది రాజకీయాలలో తరచూ జరుగుతుంటాయి. గతంలో పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వలన ఎందరో రాజకీయాల నుండి తప్పుకోవాల్సి వచ్చింది. కాగా ఇపుడు అలాంటి ఒక రాంగ్ స్టెప్ చాలా కాలం నుండి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ వచ్చిన నాయకుడు చేశారా అంటున్నారు రాజకీయ మేధావులు.
తెలంగాణలో నల్గొండ జిల్లా మునుగోడు నియాజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి గత నెల రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీకి మరియు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి దేశంలో అధికారంలో ఉన్న భారతీయ జాతీయ పార్టీ లోకి అమిత్ షా సమక్షంలో చేరడం జరిగింది. కానీ ఇది రాజగోపాల్ రెడ్డి చేసిన పెద్ద పొరపాటుగా సీనియర్ నాయకులు అంతా అభిప్రాయపడుతున్నారు. దేశంలో మెజారిటీ రాష్ట్రాలలో అధికారంలో బీజేపీ ఉన్నప్పటికి సౌత్ లో అందులోనూ తెలుగు రాష్ట్రాలలో అంతగా ఆదరణ లేదు. అయితే బీజేపీలో ఏదో ఆశించి తొందరపాటుగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని అంటున్నారు.  
ఇప్పుడు మునుగోడు లో ఉప ఎన్నికకు సమయం ఆసన్నమవుతోంది.. బరిలో తెరాస, కాంగ్రెస్ మరియు బీజేపీ లు ఉన్నాయి.. తెరాస కు సపోర్ట్ గా సిపిఎం మరియు సిపిఐ లు నిలబడిన విషయం తెలిసిందే. ఇక కాంగ్రెస్ కు ఇది సిట్టింగ్ స్థానం కాబట్టి రేవంత్ రెడ్డి కూడా పూర్తి భరోసాతో ఉన్నారు. ఇక ఈమధ్య జరిగిన ఉప ఎన్నికల ఫలితాలను దృష్టిలో ఉంచుకుని మళ్ళీ గెలిచేది మేమే అంటూ బీజేపీ ప్రగల్భాలు పలుకుతోంది. రాజగోపాల్ రెడ్డి ఈ ఎన్నికలో గెలవకపోతే అటు బీజేపీ పట్టించుకుంటుంది అన్న గ్యారంటీ లేదు. మరి రాజగోపాల్ రెడ్డి చేసిన పొరపాటు తన భవితవ్యాన్ని హరిస్తుందా చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: