కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..దసరాకు పెరగనున్న జీతం..

Satvika
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పనుంది ప్రభుత్వం..గత కొన్ని నెలలుగా జీతాల పెంపు పై తీవ్ర చర్చలు జరిగాయి.మొత్తానికి ప్రభుత్వం ఉద్యోగుల డిమాండ్ ను ఒప్పుకుంది.దసరా కల్లా కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై ఒక నిర్ణయాన్ని వెల్లడించొచ్చని పేర్కొంటున్నాయి.ఇదే జరిగితే ఉద్యోగులకు దసరా పండుగ జొనాంజా లభించినట్లే అవుతుంది. డియర్నెస్ అలవెన్స్ ( డీఏ ) పెంపు ప్రకటన వస్తే.. ఉద్యోగుల వేతనాలు కూడా పైపైకి చేరుతాయి.

కేంద్ర ప్రభుత్వం డియర్నెస్ అలవెన్స్ను 4 శాతం మేర పెంచొచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి. ఇదే జరిగితే అప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ అనేది 34 శాతం నుంచి 38 శాతానికి చేరుతుంది. ఈ ఏడాది ఆరంభంలో ప్రభుత్వం డీఏను పెంచిన విషయం తెలిసిందే. అప్పుడు డియర్నెస్ అలవెన్స్ 3 శాతం మేర పైకి చేరింది. ఇప్పుడు మళ్లీ డీఏ పెరగాల్సి ఉంది.. సెప్టెంబర్ 28న క్యాబినెట్ మీటింగ్ ఉండొచ్చని, ఇందులో డీఏ పెంపు నిర్ణయం తీసుకోవచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి. ఇలా పెరిగిన డీఏ అనేది జూలై నెల నుంచి అమలులోకి వస్తుంది..

ఇది ఇలా ఉండగా డీఏ 34 శాతంగా ఉంది. 4 శాతం డీఏ పెరిగితే అప్పుడు డియర్‌నెస్ అలవెన్స్ 38 శాతానికి చేరుతుంది. అంటే కనీస మూల వేతనం రూ. 18000గా ఉంటే.. డీఏ రూ. 6840 అవుతుంది. అంటే నెలకు రూ. 720 పెరుగుతుంది. అలాగే గరిష్ట మూల వేతనం రూ. 56,900 అయితే.. 34 శాతం డీఏ ప్రకారం అప్పుడు డీఏ రూ. 19,336 అవుతుంది. డీఏ 38 శాతం అయితే ఇది రూ. 21,622కు చేరింది.. రూ.2275 వరకు జీతం పెరుగుతుంది. ఇక ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.. మొత్తానికి పండుగకు ప్రభుత్వం గుడ్ న్యూస్ ను చెప్పనుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: