స్మోక్ చెయ్యకున్నా క్యాన్సర్ వచ్చే ప్రమాదం..పరిశోధనలో షాకింగ్ విషయాలు..

Satvika
పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం అనే సంగతి తెలిసిందే..ఇది క్యాన్సర్ కు దారి తీస్తుంది.అయితే కొత్త పరిశోధనలో తేలిన విషయాలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి..లండన్‌లోని ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్‌స్టిట్యూట్, యూనివర్శిటీ కాలేజ్ లండన్ నుండి జరిపిన పరిశోధనలో ధూమపానం చేయని వారికి కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు గురవుతారని పరిశోధకులు పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. 2020లో క్యాన్సర్ మరణాలకు ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రధాన కారణం. ప్రపంచవ్యాప్తంగా ఏటా 18 లక్షల మంది మరణిస్తున్నారు. లండన్ శాస్త్రవేత్తల కొత్త పరిశోధన ప్రకారం.. పొగాకు అలవాటు లేని వారికి కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్నట్లు తేలింది.

ఈ క్యాన్సర్ ఎలా వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం…

ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు వాయు కాలుష్యం ప్రధాన కారణమని పరిశోధకులు చెబుతున్నారు. దీని వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. గాలిలో ఉండే అతి సూక్ష్మమైన కాలుష్య కణాలు అకాల మరణానికి కారణమవుతాయి. వీటిని పార్టిక్యులేట్ మ్యాటర్ అంటారు. అవి శ్వాస, నోటి ద్వారా సులభంగా శరీరానికి చేరుకుంటాయి. గుండె, మెదడును కూడా దెబ్బ తీస్తాయి.

పరిశోధకులు ఇంగ్లాండ్, దక్షిణ కొరియా, తైవాన్ నుండి 463,679 మంది వ్యక్తుల ఆరోగ్య డేటాను తీసుకున్నారు. డేటాను పరిశీలించినప్పుడు ఊపిరితిత్తుల క్యాన్సర్, వాయు కాలుష్యం మధ్య సంబంధం కనుగొనబడింది. ఎలుకలపై చేసిన పరిశోధనలో ఈ విషయం రుజువైంది. వాయుకాలుష్యం పెరుగుతున్న కొద్దీ క్యాన్సర్ కణితుల తీవ్రత, పరిమాణం, సంఖ్య కూడా పెరుగుతుందని ఎలుకలపై జరిపిన పరిశోధనలో వెల్లడైందని చెబుతున్నారు..

ధూమపానం చేయనప్పటికీ, తనకు క్యాన్సర్ ఉందని రోగి భావించినప్పుడు ఊపిరితిత్తుల క్యాన్సర్ అనేక కేసులు ఉన్నాయి. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా 99 శాతం మంది ప్రజలు డబ్ల్యూహెచ్‌ఓ ప్రమాణాల కంటే కాలుష్య స్థాయి చాలా ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో నివసిస్తున్నారు. ప్రపంచంలోని 117 దేశాల్లోని 6 వేలకు పైగా నగరాల్లో గాలి నాణ్యత స్థాయిని తనిఖీ చేశారు. చాలా దేశాల్లో గాలి నాణ్యత తక్కువగా ఉన్నట్లు పరిశీలనలో తేలింది..ఇలా పొగాకు తీసుకోకున్నా కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని తేల్చి చెప్పారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: