ఇండియాకి చైనా మొబైల్ కంపెనీల గుడ్ బై?

Purushottham Vinay
మన ప్రధాని మోడి దెబ్బకు చైనా కంపెనీల అబ్బా అంటున్నాయి. ఇన్నాళ్లూ స్థానిక అధికారుల సహకారంతో నిబంధనలకు విరుద్ధంగా ఇండియాలో వ్యాపారం సాగించాయి. కేంద్ర ప్రభుత్వం కూడా చైనా కంపెనీల వ్యాపార లావాదేవీలపై పెద్దగా దృష్టి పెట్టలేదు. భారత సరిహద్దుల్లో చైనా సైన్యం రెండేళ్లుగా కవ్వింపులకు పాల్పడుతోంది. కరోనా సమయంలో భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చాయి. గాల్వాన్‌ వద్ద చైనా సైన్యాన్ని భాతర సైన్యం అడ్డుకుంది. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో తెలుగు సైనికుడు కల్నల సంతోషకుమార్‌తోపాటు 20 మంది మృతిచెందారు. దీనిని సీనియస్‌గా తీసుకున్న కేంద్రం.. చైనా కంపెనీల వ్యాపారంపై దృష్టి పెట్టింది. టిక్‌టాక్‌ను మొదట నిషేధించింది. తర్వాత చైనా వీడియో గేమ్స్‌తోపాటు, పలు లోన్‌ యాప్స్‌ను నిషేధించింది. తర్వాత చైనా మొబైల్‌ కంపెనీల అక్రమ వ్యాపారంపై దృష్టి పెట్టంది. కొంతమంది స్థానిక అధికారులు చైనా కంపెనీలకు సహకరిస్తున్నట్లు గుర్తించింది. వారిని తప్పించింది. తర్వాత అక్రమ వ్యాపారంపై ఉక్కుపాదం మోపుతోంది. దీంతో బెంబేలెత్తిన చైనా కంపెనీలు ఇండియాను వీడుతున్నాయి.2021 డిసెంబర్‌లో ఆదాయపు పన్ను ఎగవేతకు పాల్పడి చైనాలో తన పేరెంట్‌ కంపెనీలకు అక్రమంగా నిధుల్ని మళ్లించిందనే ఆరోపణలతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు చైనా స్మార్ట్‌ఫోన్‌ సంస్థ షావోమీతోపాటు ఇతర చైనా సంస్థల్ని విచారణ చేశారు.


ఆ విచారణ కొనసాగుతుండగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈడీ అధికారులు షావోమీ మాజీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మనుకుమార్‌జెన్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఆ తర్వాత ఒప్పో, వివో, షావోమీతోపాటు ఇతర కంపెనీలు మనీ ల్యాండరింగ్‌ యాక్ట్‌ను ఉల్లంఘిస్తున్నాయనే ఆరోపణలతో 2022, జులైలో ఈడీ అధికారులు చైనా సంస్థ వివోతోపాటు ఇతర సంస్థలకు చెందిన ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మేఘాలయా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ ఇలా మొత్తం 44 ప్రాంతాల్లో దాడులు నిర్వహించడం జరిగింది.ఇక ఈడీ దాడుల్లో వివో కంపెనీ మోసాలను బయటపడ్డాయి. వివో కంపెనీ భారత్‌లో పన్నులు ఎగొట్టి టర్నోవర్‌లో దాదాపు 50 శాతం నిధులను చైనాకు తరలించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. 2017 నుంచి 2021 మధ్య కాలంలో రూ.62,476 కోట్లు చైనా తరలినట్లు ఈడీ వెల్లడించింది. వివో పన్నుల ఎగవేత ప్రకంపనలు కొనసాగుతుండగానే.. ఒప్పో కూడా పన్నులు ఎగ్గొట్టిన విషయం వెలుగు చూసింది. ఆ కంపెనీ కూడా రూ.4,389 కోట్ల వరకు కస్టమ్‌ డ్యూటీ ఎగవేసిందని ఈడీ గుర్తించింది. వస్తువుల విలువను తక్కవ చేసి చూపించడం ద్వారా పన్ను ఎగవేతకు పాల్పడినట్లు తెలిపింది. మరో కంపెనీ షావోమి కూడా రూ.653 కోట్లు ఎగవేతకు పాల్పడింది. ఈ మూడు సంస్థలకు ఈడీ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో ఇండియాకి చైనా కంపెనీలు గుడ్‌ బై చెప్పడం ఇంట్రెస్టింగ్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: