అమరావతి : పురందేశ్వరి కత ముగిసినట్లేనా ?

Vijaya






దగ్గుబాటి పురందేశ్వరి యూపీఏ హయాంలో కేంద్రమంత్రిగా ఒక వెలుగు వెలిగారు. వైఎస్సార్ మరణం, ప్రత్యేక తెలంగాణా ఏర్పాటుతో పురందేశ్వరి ప్రాభవం కోల్పోయారు. అడ్డుగోలు విభజన వల్ల ఏపీలో కాంగ్రెస్ పార్టీకి జనాలు సమాధికట్టేశారు. దాంతో ఈ కేంద్ర మాజీమంత్రి బీజేపీలోకి జంప్ చేశారు. కేంద్ర మాజీమంత్రి అనే హోదాతో వచ్చారు కాబట్టి మొదట్లో మంచి ప్రాధాన్యతే ఇచ్చారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఒడిస్సా, ఛత్తీస్ ఘర్ రాష్ట్రాల ఇన్చార్జిగా నియమించారు.




సీన్ కట్ చేస్తే ఒక్కో పదవిని ఊడబీకేస్తున్నారు. ముందు ప్రధానకార్యదర్శి పదవిని పీకేశారు. తర్వాత ఒడిస్సా ఇన్చార్జిగా తప్పించారు. తాజాగా ఛత్తీస్ ఘడ్ ఇన్చార్జి పదవి కూడా పోయింది. వాట్ నెక్ట్స్ అన్నదే ఇపుడు పురందేశ్వరికి అర్ధం కావటంలేదు. ఈమెవల్ల బీజేపీకి ఏదో ఉపయోగం ఉంటుందని అంచనా వేసుకుని ఈమెకు పార్టీపెద్దలు పెద్ద పీఠవేశారు. అయితే తన హోదాలను ఆమె అనుభవిస్తున్నారే కానీ పార్టీకి ఏమాత్రం ఉపయోగపడటంలేదు. రాష్ట్రంలో టీడీపీని పూర్తిగా నేలమట్టం చేయాలన్నది బీజేపీ అగ్రనేతల ఆలోచన.



ఇందులో భాగంగానే పురందేశ్వరి అధ్యక్షతన పార్టీలో చేరికల కమిటిని ఏర్పాటుచేశారు. అయితే ఈమెవల్ల ఇతర పార్టీల నుండి ముఖ్యంగా టీడీపీ నుండి ఒక్కనేత కూడా బీజేపీలో చేరలేదట. అసలు చేరికల కమిటి సభ్యులతో పురందేశ్వరి ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదని సమాచారం. పార్టీకి ఉపయోగం లేకపోతే పోరక్షంగా టీడీపీతో చేతులు కలిపారనే ప్రచారం కూడా జరుగుతోంది.




వచ్చే ఎన్నికల్లో పురందేశ్వరి కొడుకు చెంచురామయ్య టీడీపీ తరపున పర్చూరు ఎంఎల్ఏగా పోటీచేయబోతున్నారనే ప్రచారం ఆమెకు నెగిటివ్ అయ్యింది. కేవలం ఎన్టీయార్ కూతురు అర్హతతోనే పురందేశ్వరి రాజకీయాల్లోకి వచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ చలవవల్ల మాత్రమే ఈమె రెండుసార్లు వైజాగ్ ఎంపీగా గెలిచారు. వైఎస్సార్ పోయారు ఈమె ప్రాభవం పడిపోయింది. జనాలు ఏరోజూ పురందేశ్వరిని ఒక నేతగా గుర్తించలేదు. కాబట్టి జనాల మీద, నేతల మీద ఈమె ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు. దీంతో బీజేపీ పురందేశ్వరిని పూర్తిగా పక్కనపెట్టేసింది. మరీ పరిస్ధితుల్లో ఈమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: