అమరావతి : ఈ ముగ్గరు ఎంపీలకు ఏమైంది ?

Vijaya






పై ఫొటోలో చంద్రబాబునాయుడుతో కనిపిస్తున్న ఐదుగురు నేతల్లో నలుగురు పార్లమెంటు సభ్యులు. రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్, లోక్ సభ ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్, కింజరాపు రామ్మోహన్ నాయుడు. పార్టీ తరపున ఉండటానికి నలుగురు ఎంపీలున్నా యాక్టివ్ గా ఉంటున్నది మాత్రం కనకమేడల మాత్రమే. మరి మిగిలిన ముగ్గురు ఎంపీలకు ఏమైంది ? అన్నది కీలకమైన ప్రశ్న.




ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేయాలని చంద్రబాబు పిలుపిస్తున్నారు. తమ నియోజకవర్గాల్లో పార్టీని ముందుండి నడిపించాల్సిన బాధ్యత ముగ్గురు ఎంపీలపైనా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఈ ముగ్గురు ఎంపీలు పార్టీలో సీనియర్లే కాకుండా తమ నియోజకవర్గాల పరిధిలో ఎక్కువమంది ఎంఎల్ఏలు కూడా లేరు. కనకమేడల తర్వాత కింజరాపు గతంలో కాస్త యాక్టివ్ గా ఉండేవారు. అలాంటిది ఇపుడు ఆయనకు ఏమైందో తెలీటంలేదు కామ్ గా ఉంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీగా కాకుండా నరసన్నపేట ఎంఎల్ఏగా పోటీచేయాలని అనుకుంటే చంద్రబాబు ఒప్పుకోలేదని సమాచారం.



ఇక మిగిలిన ఇద్దరు కేశినేని, గల్లా గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. కేశినేనికి డైరెక్టుగా చంద్రబాబుతోనే పడటంలేదు. ఆయన పార్టీకార్యక్రమాల్లో కూడా ఎక్కడా కనబడటంలేదు. చాలామంది నేతలతో కేశినేనికి సఖ్యత కూడా లేదు. అందుకనే చంద్రబాబు ఎంత మొత్తుకుంటున్నా విజయవాడ ఎంపీ అయ్యుండీ ఏమాత్రం లెక్కచేయటంలేదు. ఈయన టీడీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరబోతున్నారనే ప్రచారం చాలాకాలంగా జరుగుతోంది.



చివరగా గల్లా గురించి పార్టీనేతల్లోనే అయోమయం కనబడుతోంది. సమావేశాలు జరిగినపుడు పార్లమెంటులో మాత్రం కనిపిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కనబడటంలేదు. నేతలతో కూడా బాగా గ్యాప్ వచ్చేసింది. చాలాకొద్దిమంది మద్దతుదారులతో మాత్రమే గల్లా అందుబాటులో ఉంటున్నారు. ఈయనకు కూడా చంద్రబాబుతో గ్యాప్ వచ్చేసిందనే ప్రచారం పెరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా పోటీచేయటంలేదంటున్నారు. ఈయన మనసంతా చంద్రగిరి అసెంబ్లీ సీటుమీదుందట. మరి ఏ పార్టీ తరపున పోటీచేస్తారనే కన్ప్యూజన్ పెరిగిపోతోంది. బీజేపీ నేతలతో ఎక్కువగా టచ్ లో ఉంటున్నారనే ప్రచారం అందరికీ తెలిసిందే. ఇందుకనే ఈ ముగ్గురు ఎంపీలకు ఏమైందనే టాక్ పార్టీలోనే నడుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: