"మునుగోడు" లో ఓటుకు రూ. 30 వేలు ?

VAMSI
ప్రస్తుతం నల్గొండ జిల్లా లోని మునుగోడు ఉప ఎన్నికతో తెలంగాణ రాజకీయాలు మరింత హీటెక్కాయని చెప్పాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుండి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ వచ్చిన నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన రాజీనామాకు ముందు నుండి పార్టీకి దూరంగా ఉండడం... సొంత పార్టీలో నేతలతో సమన్వయము తో లేకపోవడం వంటి కారణాల వలన ఖచ్చితంగా దగ్గర్లోనే పార్టీ మారుతారు అన్న ప్రచారం జరిగింది. అందుకు తగినట్లుగానే గత నెలలో మునుగోడు ఎమ్మెల్యే పదవికి మరియు పార్టీకి రాజీనామా చేసి అమిత్ షా సమక్షంలో బీజేపీ లోకి వెళ్లారు. దీనితో మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఖరారు అయింది.
కానీ ఇప్పటి వరకు ఎన్నికల సంఘం నుండి ఈ ఉప ఎన్నికకు సంబంధించి అధికారికంగా ఎటువంటి ప్రకటన లేకపోవడం గమనార్హం. తెలుస్తున్న సమాచారం ప్రకారం రెండు మూడు నెలల్లో నోటిఫికేషన్ వస్తుందని అంచనా.  అయినా కానీ... పార్టీల జోరు మాత్రం మాములుగా లేదు. దాదాపుగా ఈ ఎన్నికలో పాల్గొనే అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేశారు. ముఖ్యంగా ఈ ఎన్నిక మాత్రం కాంగ్రెస్ మరియు బీజేపీ లకు గౌరవ ప్రతిష్ట అని చెప్పాలి. అందుకోసం ఎలాగైనా గెలిచి తీరాలని వ్యూహాలను రచించుకుంటున్నారు.
కాగా ఇక్కడ ఒక విషయం బాగా వైరల్ గా మారుతోంది. ప్రధానంగా అధికార పార్టీ తెరాస తో కలిపి మూడు పార్టీలు బరిలో ఉండే అవకాశం ఉంది. కాగా ఒక్కో పార్టీ  ఓటుకు పదివేల రూపాయలు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ లెక్కన చూసుకుంటే మూడు పార్టీల నుండి ఒక్కో ఓటరు కు ముప్పై వేల రూపాయలు వస్తాయన్న మాట. మరి మూడు పార్టీల నుండి అమౌంట్ తీసుకున్నా ఓటు ఎవరికీ వేస్తారు అన్నది తెలియాలంటే ఎన్నికల వరకు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: