వైసీపీలో వారిద్దరికీ ఎంపీ సీటు గల్లంతే ?

VAMSI
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పాలన అంతా అస్తవ్యస్తంగా ఉందని విపక్ష పార్టీలు అన్నీ కూడా కోడై కూస్తున్నాయి. ఇక వీరి విమర్శలతో రాష్ట్రంలో ప్రజలు సైతం వైసీపీని తప్పుబడుతున్నారు. అయితే చేస్తున్నంతలో తనకు అనుభవం లేకపోయినా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ పోతున్నాడు. గత ఎన్నికల్లో అభేద్యమైన మెజారిటీని ప్రజలు వైసీపీకి ఇచ్చారు. కాగా ఈ సారి అంతకు మించి ఎమ్మెల్యే సీట్లు 175 కు 175 మరియు ఎంపీ సీట్లు 25 కి 25 రావాలని ఇప్పటికే నాయకులు అందరికీ దిశా నిర్దేశం చేశారు.
ఆ దిశగా ఎమ్మెల్యేలు మరియు ఎంపీలు ప్రజల్లోకి వెళ్లి వారిని ఆకట్టుకోవడానికి సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సారి కొందరి ఎంపీలకు సీట్లు దక్కడం కష్టమే అని జగన్ ఆయా నాయకులకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. వారిలో మొత్తం 10 మందికి పైగానే ఉన్నట్లు వైసీపీ హై కమాండ్ నుండి సమాచారం అందుతోంది. కాగా వారిలో కొంతమందిని ఎంపీ లుగా కాకుండా, ఎమ్మెల్యే లుగా పోటీ చేయించడానికి ప్లాన్ చేశారట.
వీరు కాకుండా మరో ఇద్దరి పేర్లు మాత్రం బలంగా వినిపిస్తోంది. వారిలో ఒకరు ఇటీవల కొన్ని రోజుల నుండి న్యూడ్ వీడియో తో వైరల్ అయిన అనంతపురం జిల్లా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఉన్నాడు. దాదాపుగా ఇతనికి ఎంపీ సీటు దక్కడం కష్టమే. ఈ వీడియో ఫేక్ అని అధికారికంగా తేలిననా కూడా ఎంపీ గా పోటీ చేయడం దాదాపు అసాధ్యమే. ఇక ఈయన తర్వాత లస్ట్ లో వైజాగ్ ఎంపీ సత్యనారాయణ పేరు బలంగా వినిపిస్తోంది. ఇతను పార్టీ కార్యక్రమాలు మరియు ప్రజలకు దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది. ఇది కాకుండా ఒక ఐఏఎస్ అధికారికి చెందిన స్థలాన్ని ఇతను కబ్జా చేశారు అన్న విషయం ఇతని ఎంపీ సీటుకు కన్నం వేసింది అని చేప్పాలి. మరి ఈ లిస్ట్ లో మరెంతమంది చేరుతారు అన్నది తెలియాల్సి ఉంది.    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: