అమరావతి : ఎంపీ సర్వేలో ఇదే ఇంట్రెస్టింగ్ పాయిట్

Vijaya






వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు పొద్దున లేచిందిమొదలు రాత్రి పడుకునేవరకు  జగన్మోహన్ రెడ్డిని  టార్గెట్ చేస్తునే ఉంటారు. జగన్ అంటే ఈ ఎంపీ ఏస్ధాయిలో మండిపోతుంటారో అందరికీ తెలిసిందే. ఇలాంటి ఎంపీ చేయించిన సర్వేలో వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని ఫీడ్ బ్యాక్ వస్తుందని ఎవరైనా ఊహిస్తారా ? అందరు ఊహించినట్లుగానే సింగిల్ గా పోటీచేసినా 93 సీట్లతో టీడీపీదే అధికారం అని తేలిందట. అదే జనసేనతో కూడా కలిస్తే ఇక ఉప్పెనే అన్నట్లు చెప్పారు.



అంతాబాగానే ఉందికానీ అసలు తానుచేయించిన సర్వేపై ఎంపీకైనా నమ్మకం ఉందో లేదో అర్ధంకావటంలేదు. ఎందుకంటే నిజంగానే తానుచేయించిన సర్వే కరెక్టే అయితే వెంటనే తన ఎంపీ పదవికి రాజీనామా చేసుండచ్చుకదా. రెండుపార్టీలు పొత్తుపెట్టుకుంటే 160 సీట్లు గ్యారెంటీ అని చెప్పిన ఎంపీ తన పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఉపఎన్నికలో పోటీచేయవచ్చు. ఏదో ఒక పార్టీ తరపున పోటీచేసి బంపర్ మెజారిటితో గెలవచ్చు. నిజంగా అదే జరిగితే అప్పుడు అందరు జగన్ పనైపోయిందని డిసైడ్ అయిపోతారు.



మరంతటి బంగారంలాంటి అవకాశాన్ని రాజుగారు ఎందుకు వదులుకుంటున్నట్లు ? ఎందుకంటే తాను చేయించిన సర్వే రిపోర్టు ఎంత వాస్తవమే ఎంపీకి బాగా తెలుసుకాబట్టే.  మంచి ముహూర్తం చూసుకుని ఎంపీ పదవికి తానే రాజీనామా చేస్తానని చెబుతున్న ఎంపీకి ఇంతకంటే మంచి ముహూర్తం దొరుకుతుందా ? పదవికి రాజీనామా చేసి జగన్ను సవాలు చేసి ఉపఎన్నికలో గెలిస్తే ఆ కిక్కే వేరుకదా. ఒకవైపు చంద్రబాబునాయుడు మరోవైపు పవన్ కల్యాణ్ ఎక్కడ మాట్లాడినా ఈసారి వైసీపీ ఓటమిఖాయమని, జగన్ ఇంట్లో కూర్చోకతప్పదనే చెబుతున్నారు.



జగన్ విషయంలో ఎంపీ, చంద్రబాబు, పవన్ చెబుతున్నది ఒకటే అయినపుడు తన పదవికి రాజీనామా చేయటానికి రఘురాజు ఎందుకు భయపడుతున్నారు ? ఎంపీ చేయించిన సర్వేలో ఇదే ఇంట్రస్టింగ్ పాయింట్. ఎంపీ మాటల్లోనే సర్వే రిపోర్టు విశ్వసనీయత కనబడుతోంది. రాజీనామా చేస్తేకదా అసలు విషయం ఏమిటో జనాలకు తెలిసేది. ఆపనేదో రాజగారు తొందరగా చేసేస్తే చాలామందిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: