నారా లోకేష్ పై చంద్రబాబు వేటు ?

VAMSI
ఏపీలో జగన్ పాలన సాగుతోంది. గత ఎన్నికల్లో చంద్రబాబు పాలనతో విసిగిపోయి ఒక్క ఛాన్స్ అంటూ ఎన్నికల బరిలో నిలిచిన వైసీపీని ఏపీ ప్రజలు ఆదరించి అఖండ మెజారిటీని మూటగట్టారు. వైసీపీ ప్రభుత్వం వచ్చి మూడు సంవత్సరాలు గడుస్తోంది. పాలనలో కొన్ని పొరపాట్లు ఉన్నప్పటికీ... మధ్యతరగతి ప్రజలకు మేలు జరిగే చాలా సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి మానిఫెస్టోలో చెప్పిన ప్రతి ఒక్క అంశాన్ని విడిచి పెట్టకుండా చేసుకుపోతున్న తీరు చాలా మంది నాయకులలో కనువిప్పు కలిగించింది. ఇప్పుడు జగన్ మరియు టీం వచ్చే ఎన్నికలోనూ గెలుపే ప్రధాన లక్ష్యంగా ప్రణాళికలు రచించుకుంటోంది. ప్రతిపక్ష టీడీపీ మాత్రం వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఎలాగైనా గద్దె దించాలని ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ వస్తోంది.
కానీ టీడీపీ నేత చంద్రబాబు నాయుడు అవలంభించే తీరు పట్ల సొంత పార్టీలోనే చాలా మంది కినుక వహిస్తున్నారు. ప్రస్తుతం టీడీపీ లో హైలైట్ అవుతున్న విషయం... ఒక కుటుంబంలో ఒక్కరికే టికెట్... ఇది ఈ మధ్య జరిగిన టీడీపీ మీటింగ్ లలో చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి తెలిసిన వారంతా కూడా గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే కొన్ని జిల్లాలలో కుటుంబంలో రెండు నుండి మూడు సీట్లు వరకు ఆశించే వారే ఉండడం గమనార్హం. అలా చూసుకుంటే కర్నూల్ లో కే ఈ కృష్ణమూర్తి ఫ్యామిలీ  లో కొడుకుకి మరియు తమ్ముడుతో కలిపి 3 టికెట్లు కావాలి. ఇక అదే కర్నూల్ లో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కి ఒక టికెట్ మరియు ఆయన భార్య కోట్ల సుజాత కు మరో టికెట్...  ఇక నంద్యాల లో చూసుకుంటే భూమా అఖిల ప్రియ మరియు ఆయన సోదరుడు భూమా బ్రహ్మానందరెడ్డికి రెండు టికెట్ లు ఇవ్వాల్సి వస్తుంది.
సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈసారి యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేందుకు బాబు పావులు కదుపుతున్నారు. ఈ పద్ధతి పాటించాలంటే ముందుగా తన ఇంటి నుండే స్టార్ట్ చెయ్యాలి. నారా వారి ఇంటి నుండి చంద్రబాబు కు మాత్రమే టికెట్ తీసుకుని... లోకేష్ కు ఆపెయ్యాలి. అప్పుడే మిగిలిన నాయకులు సైతం ఈ విధానాన్ని అర్ధం చేసుకుంటారు. అలా కాకుండా వీరికి మాత్రం రెండు టికెట్లు తీసుకుని.. మిగతా అందరికీ ఒకే టికెట్ అంటే అర్ధం చేసుకునే పరిస్థితి పార్టీలో లేదు. ఇది చంద్రబాబుకు మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ విధానాన్ని ఏ విధంగా అవలంభిస్తాడో చూడాలి.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: