హైదరాబాద్ : సైలెంటుగా పనికానిచ్చేస్తున్నారా ?

Vijaya






తన వ్యూహాన్ని చంద్రబాబునాయుడు చాలా సైలెంటుగా కానిచ్చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో ఎలాగైనా టీడీపీ ఉనికిని చాటాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ప్రస్తుతం తెలంగాణాలో టీడీపీ దాదాపు భూస్ధాపితమైపోయినట్లే. చేతులారా పార్టీకి చంద్రబాబే గొయ్యితవ్వి కప్పెట్టేశారు. 2019 ఎన్నికల్లో ఘోరఓటమి దెబ్బకు ఏపీలో కూడా పార్టీ  ముక్కుతు మూలుగుతోంది. దాంతో పోయినచోటే వెతుక్కోవాలని అనుకున్నారో ఏమో కానీ మళ్ళీ తెలంగాణా మీద దృష్టిపెట్టారు.




తాను తెలంగాణాలో యాక్టివ్ అయితే కేసీయార్ నెత్తిన పాలుపోసినట్లే అన్న విషయం తెలిసికూడా చంద్రబాబు తెలంగాణాలో యాక్టివ్ అవుతున్నారు. సరే ఇక ప్రస్తుత విషయానికి వస్తే వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున అభ్యర్ధులను రంగంలోకి దింపాలని డిసైడ్ అయినట్లున్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుతానికి కొన్ని నియోజకవర్గాల ఇన్చార్జిలను ప్రకటించారు. వీరంతా బాగా యాక్టివ్ గా ఉంటే బహుశా వచ్చే ఎన్నికల్లో వీళ్ళకే టికెట్లు ఇస్తారేమో.




శాంపుల్ గా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం అధ్యక్షుడిగా వంచె శ్రీనివాసరెడ్డిని నియమించారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో అబంర్ పేటకు రాగిపణి ప్రవీణ్ కుమార్ అలియాస్ బిల్డర్ ప్రవీణ్, కంటోన్మెంటుకు గడ్డి పద్మావతి, జనగాంకు రామిని హరీష్, సిరిసిల్లకు అవునూరి దయాకరరావును ఇన్చార్జిలుగా  నియమించారు.  గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాల్లో ఒకపుడు టీడీపీకి మంచి పట్టుండేది. అసలు సమైక్య రాష్ట్రంలో సీమాంధ్ర ప్రాంతంలో కన్నా తెలంగాణాలోనే ఎక్కువ బలంగా ఉండేది.




ఇంతటి బలమైన పార్టీని చంద్రబాబు చేతులారా నాశనం చేసేసుకున్నారు. ఇపుడు నియమించిన ఇన్చార్జిలు కాకుండా తొందరలోనే పైనచెప్పిన జిల్లాల్లోని నియోజకవర్గాల్లో ఇన్చార్జిలను  నియమించాలని కసరత్తు చేస్తున్నారు. షెడ్యూల్ ఎన్నికలకు ఇక ఏడాదిన్నర మాత్రమే ఉంది కాబట్టి తెలంగాణాపైన దృష్టిపెట్టారు. తరచూ తెలంగాణా నేతలతో సమావేశాలవుతున్నారు. ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో భారీ బహిరంగసభలకు కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే మునుగోడు ఉపఎన్నికలో పోటీచేయాలని కొందరు నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరి చంద్రబాబు ఏమిచేస్తారో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: