ఊగిపోతున్న పార్వతీపురం.. గుడిలో వింత శబ్దాలు?

praveen
దయ్యాలు భూతాలు లేవు అని చెబుతున్న నేటి రోజుల్లో కొన్ని కొన్ని ఘటనలు మాత్రం ప్రతి ఒక్కరిని భయాందోళనకు గురి చేస్తూ ఉంటాయన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. పార్వతీపురం మండలం జిల్లాలో వింత శబ్దాలు కలకలం రేపుతున్నాయి. స్థానికులు అందరిని ఆందోళనకు గురి చేస్తున్నాయి. అయితే సాధారణంగా బయట ప్రాంతాలలో ఇలాంటి వింత శబ్దాలు వచ్చినప్పుడు దయ్యమో భూతమో అనుకుని జనాలు కూడా వదిలేసేవారు. కానీ ఏకంగా ఇప్పల పోలమ్మ గుడి లో ఇలా గజ్జల చప్పుడు గాజుల మోతలు వస్తూ ఉండడం మాత్రం సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. ఇక ఈ విషయం స్థానికంగా ఉన్న అన్ని గ్రామాలకు కూడా పాకిపోయింది.
 వివరాల్లోకి వెళితే.. పార్వతి పురం లో ని నాయుడు వీధి లో ఉన్న ఇప్పల పోలమ్మ గుడి దగ్గర ప్రస్తుతం ఒక ప్రచారం  హల్ చల్ చేస్తుంది. ప్రస్తుతం ఏ పండుగ లేకపోయినప్పటికీ జాతర కంటే ఎక్కువ మంది ఆ గుడి చుట్టూ చేరారు.  ఈ క్రమంలోనే గుడిలో నుంచి వస్తున్న వింత శబ్దాలను చూస్తూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇక లోపల ఏం జరుగుతుందో అని చూసేందుకు  ఒకరినొకరు తోసుకుంటూ వెళుతూ ఉండడం గమనార్హం. గత కొన్ని రోజుల నుంచి ఆ గుడిలో వింత శబ్దాలు వస్తున్నాయని ప్రచారం ఊపందుకుంది. చివరికి ఆ చెవిన ఈ చెవినా పడి ఆ ఊరిలో మాత్రమే కాదు పక్క ఊరికి కూడా చేరిపోయింది.  దీంతో భారీ మొత్తంలో జనాలు గుడి వద్దకు చేరుకుంటూ ఉండడం గమనార్హం.

 అయితే గుడిలో పసుపు వాసనతో పాటు గాజులు గజ్జెల మోతలు కూడా వినిపిస్తున్నాయని స్థానికులు అంటున్నారు. అయితే ఇప్పల పోలమ్మ ఎంతో శక్తివంతమైన దేవత అని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తుంటారు. ఇక అప్పుడప్పుడు ఊరులో ఉన్న కొంతమంది పూనకం వచ్చి ఇక అమ్మవారు వారికి కావలసింది అడిగి చేయించుకుంటుందని స్థానికులు కూడా చెబుతుండడం గమనార్హం. ఇప్పటి వరకూ అక్కడ జాతర జరగాల్సి వుంది. కానీ జాతర లేటయింది. అందుకే అమ్మవారు ఇలా సంకేతాలు పంపింది అని కొంత మంది భక్తులు చెబుతున్నారు. ఏదో అరిష్టం  జరగబోతున్నదని మరికొంత మంది భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: