అమరావతి : చంద్రబాబు చేతకానితనం బయటపడిందా ?

Vijaya






ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు చేతకానితనం మళ్ళీ బయటపడింది. ఢిల్లీ ఎయిర్ పోర్టులో సొంత ఎంపీ కాశినేనీయే అవమానించారు. ఆ అవమానాన్ని దిగమింగుకున్నారే కానీ ఏమీ మాట్లాడలేకపోయారు. ఇక్కడే చంద్రబాబు చేతకానితనం బయటపడింది. ఈ విషయంపై పార్టీ నేతలు చాలా బ్యాడ్ గా చెప్పుకుంటున్నారు. ఇంతకీ విషయం ఏమింటటే ఎయిర్ పోర్టులో చంద్రబాబుకు బొకే ఇవ్వటానికి నాని ఇష్టపడలేదు.



చంద్రబాబుకు బొకే ఇవ్వమని గల్లా జయదేవ్ పక్కనే ఉన్న నానీని అడిగినపుడు ఆ బొకేని విసురుగా తోసేశారు. జయదేవ్ అడగటం, నాని బొకేని విసురుగా తోసేయటం అన్నీ చంద్రబాబు కళ్ళముందే జరిగాయి. అయినా ఏమీ అనలేని పరిస్ధితి. నానిపై యాక్షన్ తీసుకోవాలని అనుకుంటే ఎలా రియాక్టవుతారో అనే భయం. ఈ భయానికే మంచితం, ఓర్పనే ముసుగు వేసుకుని చంద్రబాబు 40 ఏళ్ళుగా రాజకీయాల్లో నెట్టుకొచ్చేస్తున్నారు.




ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి, కేసీయార్, నరేంద్రమోడీ విషయంలో ఎవరైనా ప్రవర్తించుంటే ఏమయ్యేదో. వీళ్ళముందు తమ అసహనాన్ని ప్రదర్శించేందుకు పార్టీ నేతలెవరైనా ధైర్యం చేస్తారా అనే విషయంపై  సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఇంతకుముందు పార్టీలో కోవర్టులను ఏరిపారేస్తానని భీకరమైన ప్రకటన చేశారు చంద్రబాబు. కుప్పంలో పార్టీ ఓటమికి, నెల్లూరులో ఓటమితో పాటు చాలాచోట్ల టీడీపీ ఓటమికి కారకులెవరో తనకు తెలుసని, అలాంటి కోవర్టుల ఆటలిక సాగవని గంభీరంగా వార్నింగిచ్చారు.



చంద్రబాబు ఇచ్చిన వార్నింగ్ చూసిన తర్వాత పార్టీలో అసలేమి జరగబోతోందనే చర్చ పెరిగిపోయింది. తీరాచూస్తే ఎవరిమీదా ఎలాంటి చర్యలూ లేవు. నెల్లూరులో కొందరిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించినా వాళ్ళంతా పార్టీ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తునే ఉన్నారట. నిజానికి ఎవరిపైన కూడా యాక్షన్ తీసుకునేంత సీన్ చంద్రబాబుకు లేదని అందరికీ తెలుసు. ఏదో తానేంచెప్పినా అచ్చేసే ఎల్లోమీడియా ఉందికాబట్టి పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడేస్తుంటారు. తీరా యాక్షన్ తీసుకోవాలనేటప్పటికీ ఏమీ జరగనట్లే ఉండిపోతారు. ఈ కారణంతోనే నేతలందరికీ చంద్రబాబు అంటే అలుసైపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: