అమరావతి : సర్వే రిపోర్టును ఎల్లోగ్యాంగ్ తట్టుకోలేకపోతోందా ?

Vijaya


ఇండియా టు డే నిర్వహించిన సర్వేలో ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే వైసీపీకి 19 లోక్ సభ సీట్లు ఖాయమని వెల్లడైనవిషయాన్ని టీడీపీ తట్టుకోలేకపోతోంది. అందుకని వైసీపీపై బురదచల్లేందుకు చికోటి ప్రవీణ్ వ్యవహారాన్ని అడ్డంపెట్టుకుంటోంది. హైదరాబాద్ లో బయటపడిన చికోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారానికి ఏపీలోని మంత్రులు, ఎంఎల్ఏలు, నేతలు, వాళ్ళ పిల్లలకు ముడేసేసింది. సీనియర్ నేత వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతు నేపాల్లోని క్యాసినోలకు క్యాబినెట్లోని సగంమంది మంత్రులు, 22 మంది ఎంఎల్ఏలు వెళ్ళారని ఆరోపించారు. ఈయన ఆరోపణలకు ఆదారాలు ఏమున్నాయంటే ఏమీలేవు.  



ఏదో విధంగా బురదచల్లేయటమే టార్గెట్ గా పెట్టుకున్నారు కాబట్టి నోటికొచ్చిన ఆరోపణలు చేసేస్తున్నారు.  క్యాసినో ఆడేందుకు వెళ్ళినపుడు బసచేసిన మాచీక్రౌన్స్ హోటల్లో బసచేసిన 27 గదులను ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తనిఖీ చేయాలట. ఎందుకు తనిఖీచేయాలని డిమాండ్ చేశారో ఆయనకే తెలీదు. తమ పార్టీనాయకులు విదేశాల్లో క్యాసినోలకు వెళ్ళలేదని జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పగలరా అంటు ఓ పనికిమాలిన సవాలుచేశారు.



మంత్రులు, ఎంఎల్ఏలు క్యాసినోకి  వెళ్ళారని బురదచల్లటం వర్ల వంతు దాన్ని కడుక్కోవటం జగన్, సజ్జల వంతట. క్యాసినోకి వెళ్ళారనే ఆధారాలు ఆయన దగ్గగరుంటే వెంటనే ఈడీకి అందించి అందరినీ అరెస్టు చేయించచ్చు కదా.  ప్రవీణ్ తో కలిసి కొడాలినాని, వల్లభనేని వంశీ చాలాసార్లు నేపాల్ వెళ్ళారట. దానికి ఆధారాలు ఏమిటో మాత్రం చూపలేదు. చికోటి వ్యవహారం బయటకు వచ్చినతర్వాత చాలామంది మంత్రులు, ఎంఎల్ఏలు, నేతలు, వాళ్ళ పిల్లలు విదేశాలకు వెళ్ళిపోయినట్లు వర్ల ఆరోపణలు చాలా విచిత్రంగా ఉంది.




ఇంతమంది ఒకేసారి విదేశాలకు వెళితే ఎవరికీ తెలీకుండానే ఉంటుందా ? ఒకవేళ వెళ్ళింది నిజమే అయితే ఎవరెవరు ఏ దేశానికి వెళ్ళారనే విషయాన్ని వర్లే బయటపెట్టవచ్చు కదా ? తొందరలోనే వైసీపీ పెద్దల బండారాన్ని బయటపెడతానని చెప్పారంటేనే ఎలాంటి ఆధారాలు లేవని అర్ధమైపోతోంది. ఆయన దగ్గరున్నదల్లా  చల్లేందుకు బురదమాత్రమే. ఇలాంటి చవకబారు ఆరోపణలు వల్ల జనాల్లో విశ్వసనీయత మరింత తగ్గిపోతుందని తమ్ముళ్ళకు అర్ధం కావటంలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: