ఏపీ వాసులకు మరో హెచ్చరిక..మరో మూడు రోజులు భారీ వర్షాలు..

Satvika
దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి... మొన్న నైరుతి రుథుపవనాలు, నిన్న అల్పపీడనం వల్ల భారీ వర్షాలు కురిసాయి..అంతేకాదు భారీగా కురిసిన వర్షాలకు వరదలు రావడం దేశమంతా నీటమునిగాయి..రెండు రోజులు తగ్గిన వర్షాల వల్ల జనం ఊపిరి పీల్చుకున్నారు.ఇప్పుడు మళ్ళీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెప్పారు.ఆంధ్రప్రదేశ్ కు రానున్న మూడు రోజులకు భారత వాతావరణ శాఖ వాతావరణ సూచనను చేసింది. బలపడిన రుతుపవన ద్రోణి ఇప్పుడు గంగానగర్, రోహ్తక్, గ్వాలియర్, సిధి, అంబికాపూర్, సంబల్పూర్, బాలాసోర్ మరియు ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు ప్రయాణిస్తున్నదన పేర్కొంది.

ఈ ద్రోణి సగటు సముద్ర మట్టము ఫై 0.9 కి.మీ వరకు విస్తరించి ఉందని తెలిపింది. మరోవైపు జార్ఖండ్, పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం ఇప్పుడు ఉత్తర ఒడిశా.. పరిసర ప్రాంతాలపై ఉందని.. సగటు సముద్ర మట్టం ఫై 5.8 కి.మీ ఎత్తు వరకు విస్తరించి, ఎత్తు కు వెళ్లే కొద్దీ నైరుతి దిశగా వంగి ఉన్నదని చెప్పింది. దీంతో రానున్న మూడు రోజులు పాటు ఏపీలో వాతారణం ఈ విధంగా ఉంటుందని హెచ్చింది వాతావరణ శాఖ.

కోస్తాలో భారీ వర్షాలతో పాటు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. రేపు, జూలై 24వ తేదీ తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉందని పేర్కొంది.ఇక రాయలసీమ లో మరో మూడు రోజుల పాటు..తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములు మెరుపులుతో కూడిన భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది..ఈ మూడు రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా వుండాలని ప్రజలు అధికారులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: