తెలంగాణాలో వర్షాలు ఎలా ఉన్నయంటే..?

Satvika
పది రోజుల నుంచి తెలంగాణాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ఆ వర్షాల కారణంగా భారీగా వరదలు వచ్చి ఎన్నో గ్రామాలు నీళ్ళలో మునిగి పోయాయి.భారీగా వచ్చిన నీల్లకు  లొతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. అయిన వర్షాలు తగ్గడం లేదు.. గత 24 గంటల్లో 8 జిల్లాల్లో భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి.ప్రస్తుతం ఒడిశా తీర ప్రాంతంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతున్నదని, దీని ప్రభావం వల్ల ఈ నెల 19 వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొన్నది..

శనివారం నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది.మరోవైపు భద్రాచలం దగ్గర గోదారమ్మ మహోగ్రరూపం దాల్చుతోంది. గంట గంటకు వరద ప్రవాహం పెరగడంతో పాటు నీటి మట్టం ప్రమాదకరస్థాయికి చేరుకుంటోంది. ఇప్పటికే భద్రాచలానికి రాకపోకలు నిలిపివేయడం, టెంపుల్ టౌన్లో 144సెక్షన్ విధించారు అధికారులు..

గోదావరి నీటమట్టం సుమారు 80అడుగులకు చేరుకున్నప్పటికి సిస్ట్యూవేషన్ని కంట్రోల్ చేసేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ను ఆదేశించారు.. ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాలు అనుకున్న సమయం కంటే ముందుగానే వచ్చేశాయి. నైరుతి రుతుపవన మెఘాలు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి. ఈ కారణం వలనే తెలంగాణలో మే చివరి వారం నుంచే కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడడం ప్రారంభించాయి.. నైరుతి రుతుపవనాలు అనుకున్న సమయం కంటే ముందుగానే వచ్చేశాయి. నైరుతి రుతుపవన మెఘాలు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి. ఈ కారణం వలనే తెలంగాణలో మే చివరి వారం నుంచే కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడడం ప్రారంభించాయి.జూన్ నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: