ఏపీలో వర్షాలు తగ్గుతాయా? పెరుగుతాయా?

Satvika
దేశ వ్యాప్తంగా ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.. చాలా జిల్లాల్లో భారీ వర్షాల. కారణంగా వేల ఎకరాల్లో పంట నీట మునిగిపోయింది.. చేతికి వచ్చిన పంట నీట మునిగిపోవడం తో రైతులు ఆవేదన చెందుతున్నారు.పోయిన వారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.. వానల ధాటికి నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో వర్షాలపై వాతావరణ శాఖ తాజా అప్ డేట్ ఇచ్చింది.

ఒడిశా కోస్తా ప్రాంతం ఏర్పడిన అల్పపీడనం.. ఉత్తర కోస్తా ఒడిశా పరిసర ప్రాంతాలలో అల్పపీడనంగా మారి దానికి అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కి.మీ పైన విస్తరించి ఎత్తుకు వెళ్ళేకొలది నైరుతి వైపు వంగి ఉందని.., రుతుపవన ద్రోణి ఇప్పుడు జైసల్మేర్, కోటా, గుణ, సాగర్, జబల్‌పూర్, పెండ్రా రోడ్డు, అల్పపీడన ప్రాంత కేంద్రం ఉత్తర ఒడిశా, పొరుగు ప్రాంతాల మీదుగా ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు వెళ్లి సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ వరకు విస్తరించి ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
దీంతో మరో మూడు రోజుల పాటు రాయలసీమ, కోస్తాలో  భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.


గోదావరి మహోగ్రరూపం దాల్చింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా జూలై నెలలో భారీ వరద సంభవించింది. ధవళేశ్వరం బ్యారేజీకి దాదాపు 16లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ఇప్పటికే ధవళేశ్వరం వద్ద రెండో నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఎగువన భద్రాతలంలో గోదావరి నీటిమట్టం 58.5 అడుగులకు చేరింది.కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలంలో నదీపాయల్లోకి వరదనీరు పోటెత్తింది. దీంతో 21 లంక గ్రామాలు నీటమునిగాయి. పి.గన్నవరం, అయినవిల్లి, మామిడికుదురు మండలాల్లో కాజ్ వేలపై వరదనీరు ప్రవహిస్తోంది. అయినవిల్లి, అప్పనపల్లి, కనకాయలంక లంక కాజ్ వేల వద్ద ప్రజలు నాటు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు.కొన్ని గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి..ప్రజలు మరో మూడు రోజులు అప్రమత్తంగా వుండాలని హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: