గుడ్ న్యూస్ : రేషన్ కార్డున్నోళ్ళకి ఫ్రీగా గ్యాస్ సిలిండర్?

Purushottham Vinay
ఇక మీకు రేషన్ కార్డు ఉందా? అయితే మీకో అదిరిపోయే గుడ్ న్యూస్.. మీరు ఇప్పుడు ఉచితంగా గ్యాస్ సిలిండర్ ను పొందవచ్చు.. పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరల వల్ల ప్రజలు అనేక రకాల ఆర్థిక ఇబ్బందులను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు..దాంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది.ఇక ప్రభుత్వ పథకం ప్రకారం, అంత్యోదయ కార్డు హోల్డర్లకు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అనేవి ఉచితంగా లభిస్తాయి.ఉచిత ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.55 కోట్లు కేటాయించడం జరిగింది.కేబినెట్‌ సమావేశం తర్వాత చీఫ్‌ సెక్రటరీ సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధు ఈ ప్రాజెక్టు గురించి మీడియాకు వివరించడం జరిగింది. ఇంకా అలాగే 1,84,142 అంత్యోదయ కార్డుదారులు ఈ పథకం ద్వారా ప్రయోజనం అనేది పొందుతారు. అలాగే ఉచిత ఎల్‌పిజి సిలిండర్‌తో పాటు, గత సంవత్సరాల్లో గోధుమలు కొనుగోలు చేసేటప్పుడు రైతులకు కూడా క్వింటాల్‌కు రూ.20 బోనస్‌ను కూడా కొనసాగించాలని మంత్రివర్గం నిర్ణయించిందని తెలిపడం జరిగింది.ఇంకా అలాగే లబ్ధిదారుడు ఉత్తరాఖండ్‌లో శాశ్వత నివాసి అయి ఉండటం తప్పనిసరి.


తరువాత ఆ వ్యక్తి తప్పనిసరిగా అంత్యోదయ రేషన్ కార్డ్ హోల్డర్ అయి ఉండాలి.ఇంకా అంత్యోదయ రేషన్ కార్డ్ హోల్డర్ దానిని గ్యాస్ కనెక్షన్ కార్డుతో ఖచ్చితంగా లింక్ చేయాలి.ఇక ఈ పథకం కింద ప్రతి సంవత్సరం ఉచిత LPG సిలిండర్‌లను ఎలా పొందాలంటే..ఉత్తరాఖండ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాన్ని మీరు పొందాలనుకుంటే ఈ నెలలో అంటే జూలైలోనే మీ అంత్యోదయ కార్డ్‌ని LPG కనెక్షన్ కార్డ్‌తో మీరు లింక్ చేయండి. మీరు ఈ రెండింటిని అనుసంధానించకుంటే మీరు ఈ ప్రభుత్వ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని వెంటనే కోల్పోతారు.ఇక ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఇప్పటికే అన్ని లాంఛనాలను కూడా పూర్తి చేసింది. ఇంకా అలాగే రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల వారీగా అంత్యోదయ రేషన్ కార్డుదారుల జాబితాను కూడా సిద్ధం చేసి స్థానిక గ్యాస్ ఏజెన్సీలకు పంపింది.త్వరలోనే వారందరికీ కూడా ఈ గ్యాస్ కనెక్షన్స్ ను అందించనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: