విషాదం : 5 రూపాయల బిళ్ళ మింగి పాప మృతి!

Purushottham Vinay
చిన్న పిల్లలు దేవుళ్ళు లాంటోళ్ళు. వాళ్ళని సరైన మార్గంలో పెంచాలి. ఇంకా అలాగే చాలా జాగ్రత్తగా కంటికి రెప్ప లాగా కాపాడుకోవాలి. ఇక అభం శుభం తెలియని ఓ చిన్నారి ఆడుకుంటోంది. అక్కడ ఆ చిన్నారికి ఓ ఐదురుపాయల కాయిన్ కనిపించింది. అయితే ఆ చిన్నారి దానిని ఆమె తన నోట్లో వేసుకుంది. దీంతో ఆమె అస్వస్థతకు గురైంది. ఇక దీన్ని గమనించిన తల్లదండ్రులు ఆ పసిపాపను వెంటనే వైద్యులు దగ్గరకు తీసుకు వెళ్లారు.ఇక వైద్యులు ఆ కాయిన్ ను బయటకు తీసిన ప్రయోజనం అనేది లేకపోయింది. చివరకు ఆ చిన్నారి తన ప్రాణాలు వదిలింది. ఈ దారుణమైన విషాద ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో చోటుచేసుకుంది. కాగా.. భూదాన్‌ పోచంపల్లి పట్టణంలోని వెంకటరమణ కాలనీకి చెందిన బొంగు మహేశ్ ఇంకా అలాగే సరిత దంపతులకు ఇద్దరు కుమార్తెలు.. చిన్న కుమార్తె చైత్ర(4) వారం రోజుల క్రితం తన ఇంటివద్ద ఆడుకొంటూ అక్కడ వున్న ఐదు రూపాయల కాయిన్ మింగేసింది.అయితే.. ఇక ఆ కాయిన్‌ గొంతులో ఇరుక్కుపోవడంతో తల్లిదండ్రులు వెంటనే హుటాహుటిన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ వెంటనే ఆస్పత్రికి తరలించారు.

అక్కడ డాక్టర్లు చికిత్స చేసి చిన్నారి గొంతులోని కాయిన్ తీయడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. కానీ.. ఆ చిన్నారి సోమవారం నాడు అస్వస్థతకు గురై శ్వాస తీసుకోవడానికి చాలా తీవ్రంగా ఇబ్బంది పడింది. ఇక ఈ నేపథ్యంలో.. తల్లిదండ్రులు చైత్రను ఇంకా అదే ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే ఆమె ప్రాణాలు కోల్పోయింది. అయితే.. ఆ కాయిన్ అనేది ఇరుక్కోవడం వల్ల గొంతులో ఇన్‌ఫెక్షన్ సోకి ఆ చిన్నారి మరణించి ఉండొచ్చని స్థానికులు కూడా ఆరోపిస్తున్నారు. ఆ చిన్నారి చైత్ర ముద్దుముద్ద మాటలతో అల్లరి చేస్తూ బాగా ఆడుకుంటూనే అర్ధాంతరంగా తనువు చాలించడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరుతో విషాదంలో మునిగిపోయింది.కాబట్టి ప్రతి తల్లి దండ్రులు కూడా పిల్లలని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. వారికి ఇది మంచో ఏది చెడో.. ఏది హానికరమో ఏది ప్రమాదకరమో తెలిసేలా వారికి అర్ధమయ్యేలా చెప్పాలి.ఇంకా ప్రేమతో పాటు వారిని క్రమ శిక్షణతో కూడా పెంచాలి. ఎందుకంటే ప్రాణాలు ఒక్కసారి పోయాయంటే ఎంత ఏడ్చినా రావు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: