వారు జగన్ కి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారుగా?

Purushottham Vinay
ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు ఆ నలుగురు. ఇంకా ఎటువంటి పరిస్థితుల్లోనైనా గత ఎన్నికల్లోనే వారిని ఓడించాలని చూసినప్పటికీ సాధ్యపడలేదు.ఈసారి వారు ఇక ఓటమి పాలవ్వాలంటే ఎటువంటి వ్యూహాలు అవలంబించాలి? అనే విషయంలో జగన్ మోహన్ రెడ్డి తలమునకలై ఉన్నారు. వారిలో ముగ్గురు వచ్చేసి ఒకే కుటుంబానికి చెందినవారు.. మరొకరు వచ్చేసి వారి కుటుంబ మద్దతుదారు.ఇక కింజరాపు కుటంబాన్ని ఓడించాలనే గట్టి పట్టుదలను గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్ ప్రదర్శించినప్పటికీ ప్రజాబలం చాలా ఎక్కువగా ఉండటంతో వారే విజయపతాకాన్ని ఎగరవేశారు. టెక్కలి నుంచి కింజరాపు అచ్చెన్నాయుడు ఇంకా రాజమండ్రి నుంచి ఆదిరెడ్డి భావానీ (ఎర్రన్నాయుడి కుమార్తె) అలాగే శ్రీకాకుళం ఎంపీగా కింజరాపు రామ్మోహన్‌నాయుడు ఇంకా ఇచ్ఛాపురం నుంచి అశోక్ బెందాళం గెలుపొందారు.ఇక మూడు సంవత్సరాల నుంచే ముఖ్యమంత్రి ఈ నాలుగు స్థానాలపై ఒక వ్యూహాన్ని రూపొందించారని వైసీపీ నేతలు కూడా చెబుతున్నారు.కానీ అచ్చెన్నాయుణ్ని మాత్రం ఈసారి ఎట్టి పరిస్థితుల్లోను అసెంబ్లీలోకి అడుగుపెట్టించకూడదన్నదే ఆ పార్టీ లక్ష్యమని రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతున్నారు.


ఇంకా అలాగే అచ్చెన్నాయుడి శరీరాకృతిపై కూడా కామెంట్లు చేయడానికి కారణం.. ఇక మానసికంగా బలహీనుణ్ని చేయాలనే ఉద్దేశమని తెలుగుదేశం పార్టీ నేతలు వైసీపీ నేతలపై ధ్వజమెత్తుతున్నారు. ఎన్ని వ్యూహాలు పన్నినప్పటికీ కూడా అచ్చెన్నాయుణ్ని ఓడించలేరని స్పష్టం చేస్తున్నారు. 2019 వ సంవత్సరంలో జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటినుంచి తమ నేతను నిలువరించడానికి ప్రయత్నిస్తున్నారని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి.ఇక ప్రధానమంత్రి మోడీ పర్యటన సందర్భంగా హెలిప్యాడ్ వద్దకు అచ్చెన్నాయుణ్ని నిరాకరించడంద్వారా ప్రభుత్వం ఆయనపై పైచేయి కూడా సాధించినట్లైందని భావిస్తున్నారు. అయితే పిలిచి అవమానించడం ఎంతమాత్రం భావ్యంకాదని కూడా టీడీపీ వర్గాలంటున్నాయి. విపక్ష పార్టీలను కలుపుకుపోవాల్సిన కార్యక్రమంలో వివక్ష చూపించడం ఎంతమాత్రం కూడా తగదని హితవు పలుకుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: