అమరావతి : చంద్రబాబుకు తమ్ముళ్ళ షాక్ ?

Vijayaరౌతు మెత్తనోడైతే గుర్రం నాలుగు కాళ్ళతో తంతుందనేది చాలా పాపులర్ సామెత. ఇపుడా సామెత ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడుకు సరిగ్గా సరిపోతుంది. ఇంతకీ విషయం ఏమిటంటే వచ్చే ఎన్నికలకు సంబంధించి  కొందరు తమ్ముళ్ళు తమకు తామే టికెట్లు ప్రకటించేసుకుంటున్నారు. ఇదే సమయంలో కొందరు ఏకంగా చంద్రబాబుకే వార్నింగులిస్తున్నారు. టికెట్లు ప్రకటించేసుకుంటున్న వారిని కానీ తనకు వార్నింగులిస్తున్న వారిని గానీ చంద్రబాబు ఏమీ చేయలేక మౌనంగా చూస్తు కూర్చుంటున్నారు.పార్టీలో ప్రస్తుతం జరుగుతున్నది చూసిన తర్వాత పార్టీపై చంద్రబాబుకు పూర్తగా అదుపు తప్పిపోయిందనేది అర్ధమైపోతోంది. వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి అర్బన్ నియోజకవర్గం నుండి ఆదిరెడ్డి శ్రీనివాస్ పోటీచేస్తారని ఎంఎల్ఏ ఆదిరెడ్డి భవాని ప్రకటించేశారు. ఇంతకీ శ్రీనివాస్ ఎవరంటే ఎంఎల్ఏ భర్తే. చంద్రబాబుకు చెప్పకుండానే, అడగకుండానే వచ్చే ఎన్నికల్లో పోటీచేయబోయేది తన భర్తే అని ప్రకటించేశారంటే అర్ధమేంటి ?ఇలాగే రాబోయే ఎన్నికల్లో తాను రాప్తాడు నుండి తన కొడుకు ధర్మవరం నుండి పోటీచేస్తామని మాజీమంత్రి పరిటాల సునీత ప్రకటించేశారు. ఈమెకూడా చంద్రబాబుతో టికెట్ల విషయంలో చర్చించలేదు. ఆమెంతట ఆమే ప్రకటించేశారు. ఇలాగే మరికొందరు నేతలు కూడా తమ పోటీ విషయాన్ని తామే నిర్ణయించేసుకుని ప్రకటించేశారు. మాజీ ఎంఎల్ఏ జేసీ ప్రభాకరరెడ్డి మాట్లాడుతు అనంతపురం జిల్లాలో తాము సూచించిన వారికే టికెట్లివ్వాలంటు చంద్రబాబును బెదిరిస్తున్నారు.ఇక తాజాగా విజయవాడ ఎంపీ కేశినేని నాని అయితే చంద్రబాబుకే వార్నింగ్ ఇవ్వటం కలకలం రేపుతోంది. తన శతృవులను చంద్రబాబు ప్రోత్సహిస్తే తాను కూడా చంద్రబాబు శతృవులను ప్రోత్సహిస్తానని తెగేసి చెప్పారు. మీ ఇంటికి మా ఇల్లెంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరమని కూడా చెప్పారు. దీనికి అర్ధమేంటో ఎంపీయే చెప్పాలి. అన్నింటికన్నా కొసమెరుపేమిటంటే తాను టీడీపీతో పాటు ఏ పార్టీకి చెందిన ఎంపీని కాదని నాని ప్రకటించుకోవటం. మాజీ ఎంఎల్ఏలు, ఎంపీలు డైరెక్టుగా ఇలా మాట్లాడుతున్నా ఎవరిమీదా ఎలాంటి యాక్షన్ తీసుకోలేక చూస్తూ కుర్చంటున్నారంతే.    


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: