TTD: శ్రీవారి భక్తులకు శుభవార్త!

Purushottham Vinay
ఇక కోట్లాదిమంది శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం మంచి శుభవార్త వినిపించింది.శ్రీ తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను కొద్దిసేపటి కిందటే విడుదల చేసింది.ఇక సెప్టెంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా ఇది. టీటీడీ అధికారులు ఆన్లైన్లో దీన్ని విడుదల చేయడం జరిగింది. అలాగే ఆగస్టు నెలకు సంబంధించిన సేవా టికెట్లను కిందటి నెలలోనే విడుదల చేసింది. ఆయా టికెట్లన్నీ ఇదివరకే భర్తీ అయ్యాయి.ఇప్పుడు తాజాగా సెప్టెంబర్ నెల కోటా కూడా ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ అధికారులు భక్తుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే టికెట్లను పొందిన వారి జాబితాను కూడా విడుదల చేయనున్నారు. ఇంకా ఎల్లుండి మధ్యాహ్నం 12 గంటల తరువాత తమ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని కూడా స్పష్టం చేశారు. మొత్తం 46,470 టికెట్లను విడుదల చేశారు. ఇక ఇందులో లక్కీడిప్‌ ద్వారా భక్తులను ఎంపిక చేయడానికి 8,070 టికెట్లు కేటాయించారు.అలాగే దీనితోపాటు ముందు వచ్చిన వారికి ముందు అనే ప్రాతిపదికన 38,400 టికెట్లు ఉన్నాయి.


 ఆన్‌లైన్‌లో ఎలక్ట్రానిక్‌ డిప్‌ విధానంలో సుప్రభాతం, తోమాలసేవ, అర్చన ఇంకా అష్టదళపాదపద్మారాధన టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఏ సేవకు ఎన్ని లక్కీడిప్‌ టికెట్లను కేటాయించారనే జాబితా వివరాలను కూడా ఆ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. దీనికోసం భక్తులు ఈ ఉదయం పూట 10 నుంచి ఎల్లుండి ఉదయం 10 గంటల మధ్యలో ఆన్‌లైన్‌లో తమ వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.టికెట్ల అలాట్‌మెంట్ వివరాలను భక్తులకు ఎస్‌ఎంఎస్‌ ఇంకా ఇమెయిల్‌ ద్వారా తెలియజేస్తారు. టికెట్లు పొందిన భక్తులు రెండు రోజుల్లోగా వాటి ధరను కూడా చెల్లించాల్సి ఉంటుంది. కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం ఇంకా సహస్ర దీపాలంకార సేవల టికెట్లను ఎల్లుండి సాయంత్రం 4 గంటలకు విడుదలవుతాయని తెలిపారు. ఇక వీటిని ముందుగా వచ్చిన ముందు అనే ప్రాధాన్యత క్రమంలో కేటాయిస్తామని అన్నారు. భక్తులు తమ సేవా టిక్కెట్లను బుక్ చేసుకునే ముందు ఈ మార్గదర్శకాలను ఖచ్చితంగా గమనించాలని విజ్ఞప్తి చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

TTD

సంబంధిత వార్తలు: