అయ్యో..రైతులకు ఎంత కష్టం వచ్చింది..

Satvika
రైతుల పరిస్థితి దారుణం..వర్షం పడిన భాదలె, పడక పోయిన బాధలే..గత రెండేళ్లుగా కరోనా కారణంగా రైతుల  బాధలు చెప్పాలెము..పంట బాగా పండింది అనుకుని ఆనంద పడేలోపు మార్కెట్ లేక పంటను తోటల్లోనే వదిలేసారు.. ఇప్పుడు కొద్దిగా బాగుంది అనుకొని పంటలు వేసుకొనే లోపు అకాల వర్షాలు జనాలను ఇబ్బంది పెడుతున్నాయి..నైరుతి రుతుపవనాల కారణంగా దేశ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి.. దాని వల్ల ఎక్కడ చూసిన కూడా భారీ వరదలు పోటేత్తుతున్నాయి.వేల ఎకరాల్లొ పంటలు నీట మునిగిపోయింది.

ఆంధ్రప్రదేశ్ లో కొన్ని జిల్లాల్లొ రైతులు తీవ్ర నష్టాన్ని తీసుకువచ్చింది.అనంతపురం జిల్లాకు చెందిన సుమారు 6వేలమందికి పైగా రైతులు పంట బీమా పరిహారం పొందేలా తమ దరఖాస్తులను పున:పరిశీలించాలంటూ అధికారులకు మొరపెట్టుకున్నారు.వీరంతా గత ఖరీఫ్‌ సీజన్‌లో పంటను నష్టపోయారు. దీంతో అధిక వర్షపాతం, కరువు కింద పంట బీమా పొందేందుకు అర్హుల జాబితాలో చేర్చాలని, లేదా పరిహారంకోసం కొత్తగా దరఖాస్తుచేసుకున్న వారి జాబితాలో చేర్చాలని కోరారు. శ్రీ సత్యసాయి జిల్లా నుండి ఇదే విధంగా గత మూడు రోజుల నుండి 2,310 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అధికారులు ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమంలో పలువురు రైతులు పున: పరిశీలించాలంటూ దరఖాస్తులు సమర్పించారని అధికారులు తెలిపారు.

పంట బీమా కోసం అన్ని మండలాల నుండి దరఖాస్తులు స్వీకరించేందుకు అనంతపురం జిల్లాలో జాయింట్‌ కలెక్టర్‌ ఖేతన్‌ గార్గ్‌ స్పందన పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. సోమవారం సాయంత్రం నాటికి 3,198 మంది రైతులు అర్జీలు సమర్పించగా, వాటిలో సరిచేయదగిన కేసులు 1,428 కాగా, సరిదిద్దలేనివి/అర్హత లేనివి 1,770 ఉన్నాయి. మంగళవారం ఒక్కరోజే అనంతపురం జిల్లా అధికారులకు సుమారు వెయ్యి దరఖాస్తులు రాగా, ఇంకా పూర్తి వివరాలు అందుబాటులోకి రాలేదు. పట్టాదారు పాస్‌బుక్‌, ఇ-క్రాపింగ్‌, పూర్తి ఇ-కెవైసి ఉన్న దరఖాస్తులన్నింటినీ సరిచేయాలని, దీంతోవారు పరిహారం పొందే అవకాశాన్ని కోల్పోకుండా చూడాలని జిల్లా కలెక్టర్‌ అధికారులకు తెలిపారు.అందరికి న్యాయం జరిగేలా చూడాలని తెలిపారు..ఒకే జిల్లా నుంచి అంత మంది అర్జీ పెట్టుకోవడం ఇదే మొదటి సారి అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: