రాయలసీమ : జగన్ ప్లాన్ వర్కవుటైతే వీళ్ళకు చుక్కలేనా ?

Vijayaపుట్టపర్తి జిల్లాలో జరిగిన బహిరంగసభలో జగన్మోహన్ రెడ్డి మాటలు విన్నతర్వాత ఒక విషయం స్పష్టంగా అర్ధమైంది. అదేమిటంటే చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ మీదకు జగన్ జనాలను ఉసుగొల్పతున్నాడని. రేపటి ఎన్నికల సమయంలో ఓట్లకోసం వచ్చినపుడు చంద్రబాబు, పవన్ను నిలదీయండని జగన్ పిలుపునిచ్చారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎందుకు అమలుచేయాలేదని చంద్రబాబును నిలదీయమని జగన్ డైరెక్టుగానే చెప్పారు.రైతురుణహామీ, డ్వాక్రాసంఘాల రుణాల హామీలను ఇచ్చిన చంద్రబాబు వాటిని ఎగొట్టినట్లు ఆరోపించారు. 2014 ఎన్నికల సందర్భంగా టీడీపీ మ్యానిఫెస్టోను ఎందుకు అమలు చేయలేదు ? ఎందుకు వెబ్ సైట్లో నుండి తీసేశారో నిలదీయాలని జగన్ చెప్పారు. అలాగే తన హయాంలో రైతులు, కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే పరిహారం ఎందుకు ఇవ్వలేదో కూడా అడగాలన్నారు. అప్పట్లో ఆత్మహత్యలు చేసుకున్న 438 మంది రైతులకు తమ ప్రభుత్వం వచ్చిన తర్వాతే పరిహారం ఇచ్చినట్లు జగన్ చెప్పారు.అలాగే చంద్రబాబు హయాంలో రైతు, డ్వాక్రా రుణాలు తీర్చకపోయినా దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదో నిలదీయమన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న కౌలురైతుల కుటుంబాల పరామర్శకు అప్పట్లో పవన్ ఎందుకు పర్యటనలు చేయలేదో కూడా జనాలు పవన్ను నిలదీయాలని పిలుపిచ్చారు. 10వ తరగతి పరీక్షల్లో ఫెయిలైన విద్యార్ధులకు మళ్ళీ పరీక్షలు పెడుతుంటే కూడా వీళ్ళద్దరు తట్టుకోలేకపోతున్నట్లు జగన్ మండిపడ్డారు. ప్రభుత్వం ఏమి మంచిపని చేద్దామని ప్రయత్నం మొదలుపెట్టినా అడ్డకునేందుకు ఎల్లోమీడియాతో పాటు చంద్రబాబు, పవన్ రెడీగా ఉంటారని మండిపోయారు.ప్రజలకు మంచిపనులు చేద్దామనుకునే తమ ప్రభుత్వం కావాలో, హామీలిచ్చి తర్వాత తుంగలో తొక్కేసిన తోడుదొంగలు  చంద్రబాబు, పవన్ కు అధికారం ఇవ్వాలో జనాలు ఆలోచించుకోవాలన్నారు. హామీలిచ్చి మర్చిపోయి, జనాలను ఏమార్చే రోజులు పోయాయన్నారు. తామిచ్చిన హామీలను, మ్యానిఫెస్టోను ముందుపెట్టుకునే గడపగడపకు వైసీపీ ప్రభుత్వం అనే కార్యక్రమం చేస్తున్నట్లు జగన్ గుర్తుచేశారు. ఇచ్చిన హామీల్లో 95 శాతం అమలు చేశాం కాబట్టే ధైర్యంగా మ్యానిఫెస్టోను చూపిస్తున్నట్లు జగన్ చెప్పారు. జగన్ చెప్పింది బాగానే ఉందికానీ  మరి ప్లాన్ వర్కవుటవుతుందా ?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: