టీడీపీ ఎమ్మెల్యే 'వంశీ'కి గన్నవరం కష్టాలు... తీరేలా లేవే?

VAMSI
2019 ఎన్నికల్లో రాష్ట్రము మొత్తం వైసీపీ ప్రభంజనం ఏ విధంగా ఉన్నదో మనము చూశాము. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఏపీలో 153 సీట్లు గెలుచుకుని సంచలన విజయాన్ని అందుకుంది జగన్ నేతృత్వంలోని వైసీపీ. అయితే ఇంతటి వైసీపీ జోరులో కూడా టీడీపీ 22 సీట్లు గెలుచుకుంది. అయితే ఈ గెలిచినా ఎమ్మెల్యేలు ఉద్దండులు అని చెప్పాలి. ఎందుకంటే వీరు ఆయా నియోజకవర్గాలలో గెలిచారు అంటే జగన్ మీద గెలిచినట్లే లెక్క. అలా గెలిచిన వారిలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఒక్కరు. అయితే అప్పుడే ఇతని మదిలో ఒక ఆలోచన వచ్చింది.. ఇక టీడీపీలో భవిష్యత్తు లేదనుకున్నాడో ఏమో తెలియదు కానీ వైసీపీ లోకి వెళ్ళడానికి బహిరంగంగా అసెంబ్లీలనే చెప్పేశాడు.
ఇక అప్పటి నుండి జగన్ భజన చేస్తూ, టీడీపీని వారి నాయకులను తిడుతూ వచ్చాడు. అయితే మూడేళ్లు గడిచిపోయింది. ఇప్పుడు మరో రెండు సంవత్సరాలలో ఎన్నికలు రానున్నాయి. గన్నవరం సీట్ జగన్ ఎవరికీ ఇస్తారు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఈ సీట్ కోసం టీడీపీ నుండి వచ్చిన వంశీ, మరియు గన్నవరం వైసీపీ సమన్వయ కర్త దుట్టా రామచంద్రరావు లు పోటీ పడుతున్నారు. అయితే తాజాగా గత ఎన్నికల్లో గన్నవరం నుండి వైసీపీ ఎమ్మెల్యే గా పోటీ చేసి ఓడిపోయిన వెంకట్రావు తెరమీదకు రావడంతో ఇప్పుడు ముగ్గురు లైన్ లో  ఉన్నారు.
అయితే కొంతకాలంగా వెంకట్రావు అంత యాక్టీవ్ గా లేడు.. పైగా టీడీపీలో చేరడానికి చూస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ వెంకట్రావు చెబుతున్న ప్రకారం నేను ఏ పార్టీలోకి వెళ్లడం లేదు. జగన్ నాకు సీట్ ఇస్తాడని నమ్మకంగా ఉన్నానంటూ కొత్త సమస్యను వంశీకి తెచ్చిపెట్టాడు. ఇప్పుడు ఈ సమస్యను వంశీ ఎలా సాల్వ్ చేసుకుంటాడు అన్నది ఊహకందని విషయం.    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: