తెలంగాణ : త్వరలో 10 ప్రాజెక్ట్ లకు టెండర్లు!

Purushottham Vinay
ఇక తెెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణంపై కేంద్ర ఉపరితల రోడ్డు ఇంకా రవాణా శాఖ ప్రత్యేక దృష్టిసారించింది. తెలంగాణ రాష్ట్రం నుంచి దేశంలోని ప్రధాన నగరాలకు అనుసంధానం ఉండటం ఇంకా హైదరాబాద్‌ ప్రపంచ నగరాల సరసన చేరడంతో తెలంగాణలోనూ జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులను చాలా భారీగానే ఇస్తోంది.ఇక ఇందులో భాగంగానే త్వరలో పది ప్రాజెక్టులకు టెండర్లను ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు టెండర్లు ఖరారు చేయనున్నారు. అలాగే ఈ ఏడాది చివరికల్లా రూ.28, 615 కోట్ల వ్యయంతో 715 కి.మీ. మేర ఉండే 10 వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన టెండర్లు కూడా ఖరారు చేయను న్నట్లు తెలిసింది. దీనిపై ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు బాగా కసరత్తులు చేపడుతున్నారు. ఈ పది ప్రాజెక్టుల్లో కూడా ప్రధానంగా నాగ్‌పూర్‌-విజయవాడ 163 హైవేను 311 కి.మీ.మేరకు 3 ప్యాకేజీలుగా రూ.8994 కోట్లతో నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి రెండేళ్ల క్రితమే భూసేకరణ అనేది పూర్తయింది. ఇంకా కొంత వరకు రోడ్డు నిర్మాణం కూడా కొనసాగుతోంది.


రీజినల్‌ రింగ్‌రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌)సంగారెడ్డి-నర్సాపూర్‌-తూఫ్రాన్‌-చౌటుప్పల్‌(ఉత్తర భాగం)ను 158 కి.మీ.ను మొత్తం రూ.11590 కోట్లతో నిర్మిస్తున్నారు. ఇక ఈప్రాజెక్టు భూసేకరణకు కేంద్రం రెండు గెజిట్‌లను ఇప్పటికే విడుదల కూడా చేసింది. వీటితోపాటు ఈఏడాది చేపట్టనున్న ఏడు ప్రాజెక్టులలో తొండపల్లి-కొత్తూరు 12కి.మీ., ఇంకా కాలకల్లు-గుండ్లపోచంపల్లి 17 కి.మీ. ప్రాజెక్టులను గత నెల 29 కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ శంషాబాద్‌లో శంకుస్థాపన చేసిన విషయం కూడా తెలిసిందే. కరీంనగర్‌ టు వరంగల్‌ హైవేలకు టెండర్లను ఇప్పటికే ఆహ్వానించడం జరిగింది. మిగిలిన మరో 6 ప్రాజెక్టులకు భూసేకరణ పూర్తయినట్లు అధికారిక వర్గాల ద్వారా సమాచారం తెలిసింది. ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రాజెక్టు ఇంకా నాగపూర్‌-విజయవాడ ప్రాజెక్టులో భాగంగా మంచిర్యాల నుంచి వరంగల్‌ ఇంకా ఖమ్మం మీదుగా విజ యవాడ వరకు ప్రాజెక్టుకు త్వరలో టెండర్లు పిలవను న్నారు. ఈ పది ప్రాజెక్టుల్లో ఏడు ప్రాజెక్టులకు భూసేకరణ పూర్తిఅయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: