కర్నూల్ పాలిటిక్స్: నంద్యాలలో వైసీపీ హవా తగ్గిందా ?

VAMSI
ఏపీలో 2019 లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ చారిత్రక మెజారిటీతో అధికారాన్ని చేజిక్కించుకుంది. సీఎంగా గద్దెనెక్కిన జగన్ తన పాదయాత్రలో గమనించిన అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని మేనిఫెస్టో చేసిన సంగతి తెలిసిందే. అదే విధంగా తన పాలనలో మానిఫెస్టోనే ప్రధానముగా అనుసరిస్తూ వచ్చాడు. అయితే ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఏమి కావాలో అన్న విషయంపై సరైన దృష్టి పెట్టక విపక్షాలకు విమర్శించే అవకాశాన్ని తానే ఇచ్చాడు. ఇలా మరి కొన్ని కారణాల వలన రాష్ట్రంలోని కొన్ని వర్గాల ప్రజలు జగన్ పై మరియు ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారు. అయితే ఇది కొన్ని నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది.

అందులో భాగంగా కర్నూల్ జిల్లాలోని నంద్యాల నియోజకవర్గంలో వైసీపీ హవా తగ్గినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందుకు కారణం ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసుకోవడం అంటున్నారు రాజకీయ ప్రముఖులు. కేవలం సంక్షేమం ఒక్కటి ఉంటె సరిపోదు.. దీని ద్వారా ప్రజలను సంతోషపెట్టడం కుదరదు అంటూ కొందరు డైరెక్టుగానే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఇది కాకుండా నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరగడం, పెట్రోల్ మరియు డీజిల్ ధరలు కూడా ఎక్కడా లేనంతగా ఏపీలో పెరగడం.. మహిళలపై దాడులు మరియు అత్యాచారాలు వంటి పలు రకాల కారణాల వలన ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం పోతోందని తెలుస్తోంది. అయితే ఇలా అనేక పొరపాట్లను టీడీపీ ప్రజల దృష్టికి ఒక ప్రణాళిక ప్రకారం తీసుకు వెల్తూ సక్సెస్ అవుతోంది.

అయితే నంద్యాల విషయానికి వస్తే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కొద్ది రోజులుగా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేరని తెలుస్తోంది. అందుకే ప్రజలు తమ సమస్యలను ఎవరికీ చెప్పుకోవాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నారట. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఇలా కొన్ని అంశాలు మైనస్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి జగన్ ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోతే ఇలాంటి నియోజకవర్గాల సంఖ్య పెరిగే ఛాన్సెస్ లేకపోలేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: