హైదరాబాద్ పబ్ లలో మరీ ఇంత దారుణమా..?

Deekshitha Reddy
గతంలో హైదరాబా లోని ఓ పబ్ లో డ్రగ్స్ కలకలం రేగింది. సెలబ్రిటీల పిల్లలు కూడా ఆ పబ్ కి వెళ్లి తెల్లవారే వరకు అక్కడే ఉండటం, వారిని పోలీసుుల అదుపులోకి తీసుకోవడంతో హంగామా కనిపించింది. కానీ కొన్ని రోజులకే ఆ విషయాన్ని అందరూ మరచిపోయారు. ఆ తర్వాత ఇప్పుడు మరో పబ్ నుంచి ఓ మైనర్ బాలికను తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయినా కూడా ఎవరూ తగ్గడంలేదు. తాజాగా కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఓ పబ్ నిర్వాహకుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక్కడ అమ్మాయిలతో అర్థ నగ్నంగా డ్యాన్స్ లు చేయిస్తున్నట్టు పోలీసులు గమనించారు.
పబ్ కల్చర్ ఎక్కువగా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లోనే ఉంటుందని అనుకుంటుండేవారు. కానీ కూకట్ పల్లి వరకు కూడా అది వ్యాపించింది. తాజాగా కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో కబ్ల్‌ మస్తీ పబ్‌ అనే పేరుతో చీకటి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు కొంతమంది. ఈ పబ్‌ పై ఎస్‌ఓటీ పోలీసులు దాడులు నిర్వహించి, అసలు గుట్టు బట్టబయలు చేశారు. ఈ పబ్ లో యువతులతో అర్థ నగ్నంగా డ్యాన్స్ లు చేయిస్తున్నట్టు తెలిసింది. ఇక్కడ డీజే సౌండ్ కూడా చుట్టు పక్కలవారికి ఇబ్బంది కలిగేలా ఉంది. దీంతో పోలీసులు దాడి చేశారు.  
కూకట్ పట్టి హోసింగ్ బోర్డ్ కాలనీలో మంజీరా మెజిస్టిక్‌ కమర్షియల్‌ లోని క్లబ్‌ మస్తీ పబ్‌ లో ఇలాంటి చీకటి కార్యకలాపాలు జరుగుతున్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. మాదాపూర్‌ ఎస్‌ఓటీ పోలీసులు వెంటనే అక్కడికి వెళ్లి తనిఖీలు చేపట్టారు. ఆ పబ్‌ లో యువతులతో అర్ధనగ్న నృత్యాలు చేయిస్తున్నారని వారు గమనించారు. వారిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 9మంది యువతులు, పబ్ మేనేజర్‌ ప్రదీప్‌, పబ్ డీజే ఆపరేటర్‌ ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పబ్ యజమాని, మేనేజర్లు పరారీలో ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. అక్కడ పబ్ లో ఉన్న డీజే మిక్సర్ ని హుక్కా ప్లేయర్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కస్టమర్లను ఆకట్టుకోడానికి ఇలా అమ్మాయిలను తీసుకొచ్చి డ్యాన్స్ లు చేయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: