ఏపీ ప్రజలకు అలర్ట్..రానున్న మూడు రోజులు వాతావరణ రిపోర్ట్..

Satvika
గత వారం రోజుల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారుగా వర్షాలు కురిసాయి..రెండు రోజుల క్రితం కోస్తా జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే..ప్రస్తుతం భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.రానున్న మూడు రోజుల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.గతకొన్ని రోజుల క్రితం నైరుతి రుతుపవనాల కారణంగా చల్లబడ్డ వాతావరణం మళ్లీ ఒక్కసారిగా వేడెక్కనుంది. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.

 
ప్రజలు వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. డీహైడ్రేషన్‌ బారిన పడకుండా ఓఆర్‌ఎస్‌ తీసుకోవాలని తెలిపారు. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో రేపటి నుంచి వరుసగా మూడు రోజులు అధిక శాతం ఉష్నొగ్రతలు నమోదు అవుతాయని అధికారులు తెలిపారు. ఏ రోజు ఎలా ఉంటుందో ఒకసారి చుద్దాము..

శుక్రవారం..తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, పశ్చిమగోదావరి, ఏలూరు,ఎన్టీఆర్, కృష్ణా,గుంటూరు,పల్నాడు, బాపట్ల జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 46°C-47°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. అలాగే పార్వతీపురంమన్యం, శ్రీకాకుళం,విజయనగరం, అనకాపల్లి, ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములునెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 43°C-45°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు..మిగిలిన జిల్లాల్లో కూడా అలాగే నమోదు కానున్నాయి.


ఇక శనివారం..కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 45°C-47°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే పార్వతీపురంమన్యం, విజయనగరం, కోనసీమ, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 43°C-45°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.


ఆదివారం..కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 44°C-46°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే విజయనగరం, పార్వతీపురంమన్యం, కోనసీమ, కాకినాడ తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, తిరుపతి, చిత్తూరు, వైఎస్సార్, అన్నమయ్య, అనంతపురం, శ్రీసత్యసాయి, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 40°C-43°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.. మిగిలిన ప్రాంథాల్లొ 37 డిగ్రీలు నమోదు కానుంది.ప్రజలు జాగ్రత్తలు వహించాలని అధికారులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: