అమరావతి : జగన్ కు డిజప్పాయింట్మెంట్ తప్పలేదా ?

Vijaya



జగన్మోహన్ రెడ్డి బాగా డిసప్పాయింట్ అయినట్లే ఉన్నారు. జగన్ ఆశలపై చంద్రబాబునాయుడు నీళ్ళు చల్లేశారు..ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్చు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ ఉపఎన్నికల్లో టీడీపీ పోటీచేయకూడదని డిసైడ్ చేసింది. చనిపోయిన వారి కుటుంబాల్లో ఎవరికైనా టికెట్ ఇస్తే ఆ ఉపఎన్నికలో టీడీపీ పోటీచేయకూడదనే నిర్ణయానికి కట్టుబడున్నట్లు చంద్రబాబు పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో ప్రకటించారు.



చంద్రబాబు ప్రకటనకు ఏంగానీ పోటీచేసినా గెలిచే అవకాశం లేకపోవటం వల్లే టీడీపీ పోటీ చేయకూడదని నిర్ణయించిన విషయం అందరికీ తెలిసిందే. ఆత్మకూరులో పోటీచేస్తే వచ్చే ఫలితం ఏమిటో చంద్రబాబుకు బాగా తెలుసు. మొన్నటి బద్వేలు అసెంబ్లీ ఉపఎన్నికల్లో కూడా ఇలాగే చెప్పి తప్పుకున్నది. నిజంగానే పార్టీ నిర్ణయానికి అంతగా కట్టుబడుందా అన్నదే అసలైన పాయింట్. ఎందుకంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు నంద్యాల అసెంబ్లీ ఉపఎన్నిక జరిగిన విషయం గుర్తుండే ఉంటుంది. 



2014లో వైసీపీ తరపున గెలిచిన భూమా నాగిరెడ్డిని పార్టీ ఫిరాయించేవరకు చంద్రబాబు నిద్రపోలేదు. తర్వాత మారిన పరిణామాల్లో భూమా చనిపోయారు. టెక్నికల్ గా భూమా వైసీపీ ఎంఎల్ఏనే. మరపుడు వైసీపీ ఎంఎల్ఏ చనిపోతే టీడీపీ పోటీ పెట్టకూడదు కదా. అయినా ఎందుకని భూమా తమ ఎంఎల్ఏనే అనే వితండవాదాన్ని వినిపించి పోటీకి దిగింది ? ఎందుకంటే అధికారంలో ఉన్నాంకాబట్టి అడ్డదారుల్లో ఈజీగా గెలుచుకోవచ్చనే నమ్మకంతోనే వితండవాదంతో ఉపఎన్నికల్లో పోటీకి దిగింది.  ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత అంత  ధైర్యం చేయలేకపోతోంది.



ఇపుడు ఉపఎన్నికలో ఎందుకు దిగలేదంటు డిపాజిట్లు వచ్చేది అనుమానం కాబట్టే. ఎలాగైనా టీడీపీని పోటీలోకి దింపాలని వైసీపీ నేతలు బాగానే ప్రయత్నించారు. అయితే అధికారపార్టీ నేతల ఆలోచనలు తెలుసుకాబట్టే పరువుపోగొట్టుకోకుండా పోటీకి దూరంగా ఉండిపోయారు. నిజానికి జగన్ కూడా ఇక్కడ టీడీపీ పోటీచేయాలనే కోరుకున్నారు. టీడీపీ పోటీకి దిగుంటే జనాలనాడి కాస్త తెలుసుకునే అవకాశముండేది. అయితే పోటీకి టీడీపీ దూరంగా ఉండిపోవటంతో జగన్ కు డిజప్పాయింట్మెంట్ తప్పలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: