చంద్రబాబుకి సవాల్ విసిరిన మంత్రి విడదల రజిని..

Deekshitha Reddy
సామాజిక న్యాయభేరి బస్సు యాత్రలో పాల్గొంటున్న నేతలు చంద్రబాబుపై విమర్శలు ఎక్కు పెడుతున్నారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని.. చంద్రబాబుకి సవాల్ విసిరారు. టీడీపీకి ఒంటరిగా పోటీ చేేసే ధైర్యం ఉందా అని ఆమె ప్రశ్నించారు. మీ ఓట్లు నాకు వేయండి. మీ తలరాతలు మారుస్తానని జగన్ ఎన్నికల్లో హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని నూటికి నూరు శాతం అమలు చేస్తున్నారని చెప్పారు. అదే సమయంలో టీడీపీ ఒంటరిగా పోటీ చేయగలదా అని ఆమె ప్రశ్నించారు. జనసేన, బీజేపీ సపోర్ట్ లేకుండా 2024లో చంద్రబాబు బరిలో దిగగలరా అని అడిగారు.
వైసీపీని ప్రజలు ఓడించాలని చంద్రబాబు పిలుపునిస్తున్నారని, అసలు ప్రజలు జగన్ ని ఎందుకు ఓడించాలని ప్రశ్నించారు ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా. కరోనా సమయంలో అన్ని వర్గాల ప్రజలను ఆదుకున్నందుకా అని ఆయన ప్రశ్నించారు. తల్లుల ఖాతాల్లో అమ్మఒడి డబ్బులు వేసినందుకా అని అడిగారు. ఆటోవాలాలు, డ్వాక్రా మహిళలకు రుణాలిప్పించి వారి కుటుంబాలకు ఆర్థికంగా అండగా ఉన్నందుకు జగన్ ని ఓడించాలా అని అంజాద్ బాషా ప్రశ్నించారు.
మహానాడు వేదికగా చంద్రబాబు, ఆ పార్టీ నాయకులంతా కలసి పేదలకు వైసీపీ ప్రభుత్వం సొమ్ము పంచుతోందని చెబుతున్నారని, అయితే ఆ పంపకాలన్నీ ప్రజా సంక్షేమం కోసమేనని చెప్పారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. వైసీపీ పంచుడులో ఎక్కడైనా అవునీతి జరిగిందా అని ఆయన ప్రశ్నించారు. అవినీతి జరిగితే నిరూపించండి అంటూ సవాల్ విసిరారు.
మహానాడు వేదికపై బీసీ వర్గానికి ప్రాధాన్యం దక్కలేదని, ఏపీ టీడీపీ నాయకుడిగా అచ్చెన్నాయుడు ఉన్నా కూడా ఆయన ఫొటో లేకుండా చేశారని అన్నారు పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి. టీడీపీ బీసీలకు ఇచ్చే ప్రాధాన్యం ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. తన ఫొటో లేకపోయినా, ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా తనకు అంతంత మాత్రమే ప్రాధాన్యం ఇచ్చినా.. అచ్చెన్నాయుడు ఏ మొహం పెట్టుకుని  మహానాడుకి వెళ్లారో అర్థం కావటం లేదని, ఏ మొహం పెట్టుకుని వైసీపీపై విమర్శలు చేస్తున్నారో అర్థం కావడంలేదన్నారాయన.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: